గోడౌన్లలో బాణాసంచా అక్రమనిల్వ... పోలీసులు మెరుపుదాడులు
దీపావళి పండగ నేపథ్యంలో భారీగా టపాసులను నిల్వవుంచిన గోడౌన్ పై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో దాదదాపు కోటి రూపాయల విలువచేసే బాణాసంచా సామాగ్రి పట్టుబడింది.
దీపావళి నేపథ్యంలో ఎలాంటి అనుమతులు లేకుండా భారీగా టపాసులను నిల్వవుంచిన గోడౌన్ పై పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు. కృష్ణాజిల్లా వీరులపాడు మండలం జమ్మవరం గ్రామంలో ఓ నిర్మానుష్య ప్రదేశంలో వున్న గోడౌన్ పై ఈ దాడులు జరిగాయి. పట్టుబడిన బాణాసంచా విలువ దాదాపు కోటి రూపాయలు వుంటుందని తెలుస్తోంది.
కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్ర బాబు, నందిగామ డిఎస్పి రమణ మూర్తి ఇచ్చిన సమాచారం మేరకు నందిగామ రూరల్ సీఐ సతీష్ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. వీరులపాడు ఎస్ఐ రామ గణేష్, కంచికచర్ల ఎస్సై శ్రీహరి బాబు వారి సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. దీంతో భారీస్థాయిలో ప్రమాదకర పేలుడు పదార్ధాలతో కూడిన టపాసులు పట్టుబడ్డాయి.
Read more తాళ్ళరేవు పేలుళ్ల ఎఫెక్ట్... బాణాసంచా కేంద్రాలపై పోలీసుల దాడులు...
జమ్మవరం గ్రామంలోని ఒక నిర్మానుష్యమైన ప్రాంతంలో పాడుబడిన పొగాకు గోడౌన్ లో అక్రమంగా భారీస్థాయిలో టపాసులు నిల్వ వుంచినట్లు పోలీసులకు సమాచారం అందింది. గత కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా రహస్యంగా విజయవాడ తదితర సుదూర ప్రాంతాల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఈ బాణసంచా సామాగ్రిని తీసుకొచ్చి ఇక్కడ నిల్వ వుంచినట్లు తెలుస్తోంది.
ఇక్కడి నుండి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు తరలించి రిటైల్ మార్కెట్ లో భారీ ధరలకు అమ్ముతున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన పోలీసులు ఈ ముఠా గుట్టు రట్టు చేశారు. పోలీసుల దాడుల్లో పట్టుబడిన బాణాసంచా విలువ సుమారు కోటి రూపాయలు వుంటుందని అంచనా. కేవలం 2 లక్షల రూపాయలు మాత్రమే బిల్లుతు మాద్రమే పోలీసులకు లభించాయి. మిగతా వాటికి కనీసం బిల్లులుకూడా లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
కనీస అనుమతులు కూడా తీసుకోకపోగా నిర్వహకులు పోలీసులపైనే దౌర్జన్యానికి దిగారు. రేపట్లోగా కలెక్టర్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొస్తామంటూ పోలీసులకు నిర్లక్ష్యపు సమాధానం చెప్పారు. పట్టుబడ్డ సరుకును పోలీసులు స్వాధీనం చేసుకొని నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు.
ఇటీవలే కొత్తపేటలో ఎలాంటి అనుమతు లేకుండా నడుస్తున్న బాణాసంచా తయారీకేంద్రాలు, హోల్ సేల్ గోడౌన్ లపై అమలాపురం అధికారులు దాడులు నిర్వహించారు. ఆర్డీఓ బిహెచ్ భవాని శంఖర్,డీఎస్పీ ఎస్కె మాసుమ్ బాషాలు తమ సిబ్బందితో కలిసి మెరుపు దాడులు నిర్వహించారు.
video: బాణాసంచా తయారీ కేంద్రాలపై దాడులు, సీజ్...
మండలపరిధిలోని వాడపాలెం శివారు నారాయణలంకలోని యాళ్ల నాగ వెంకటవర ప్రసాద్ కు చెందిన విజయదుర్గా ఫైర్ వర్క్స్ కేంద్రాన్ని సీజ్ చేశారు. అలాగే పనసలదొడ్డి రోడ్ లో దూలం శివాజీ కు చెందిన కనకదుర్గా ఫైర్ వర్క్స్ కు చెందిన లైసెన్స్ లేని అదనపు షెడ్డు ను సీజ్ చేశారు. హోల్ సేల్ గోడౌన్ నందు అనధికారికంగా వేసిన షెడ్డులో నిల్వ చేసిన బాణాసంచా సామాగ్రిని సీజ్ చేశారు.