వారిద్దరూ ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. వారి ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో... వారిని ఎదురించి పెళ్లి చేసుకున్నారు. వారి పెళ్లై నాలుగు సంవత్సరాలు గడుస్తోంది. వీళ్ల ఆచూకీ కనిపెట్టిన యువకుడి కుటుంబసభ్యులు.. వాళ్లని విడదీయాలని పథకం వేశారు. వాళ్ల అబ్బాయిని వాళ్లే కిడ్నాప్ చేశారు. చివరకు పోలీసులకు చిక్కారు. ఈ సంఘటన కృష్ణా జిల్లా నూజివీడులో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...  వివరాల్లోకి వెళితే తూర్పుగోదావరి జిల్లా దేవుడు అన్నవరం చెందిన తాడిపర్తి వీరబాబు,కృష్ణా జిల్లా విజయవాడకు చెందిన శిరీష ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదురించి  4 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ తమ పెద్దలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.

Also Read ఏపీలో కలకలం... ఏలూరులో మరో కరోనా అనుమానిత కేసు...

 నూజివీడు ప్రకాష్ గార్డెన్స్ లో భార్యాభర్తలిద్దరూ పనికి కుదిరి తోటలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు.వీరికి ఒక సంవత్సరన్నర పాప ఉంది. కాగా... ఇటీవల వీళ్ల ఆచూకీ వీరబాబు కుటుంబసభ్యులకు తెలిసిపోయింది. దీంతో.. వాళ్లను వేరు చేయాలని అనుకున్నారు. పథకం ప్రకారం.. వీరబాబుని తమ వద్దకు రప్పించుకోవాలని ప్లాన్ వేశారు.

 వీరబాబు కుటుంబ సభ్యులు, కొందరు వ్యక్తులతో తోట లో ప్రవేశించి వీరబాబు కాళ్లు చేతులు కట్టి కారులో కిడ్నాప్ చేశారు. విషయం తెలుసుకున్న భార్య  శిరీష  వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.   వెంటనే అప్రమత్తమైన నూజివీడు డిఎస్పి, సర్కిల్ ఇన్స్పెక్టర్ లు  నూజివీడు సబ్ డివిజన్ పోలీసులను అలర్ట్ చేశారు. 

వెంటనే పట్టణ ఎస్ఐ తన సిబ్బంది అన్ని స్టేషన్లకు సమాచారం అందించి,అన్ని చెక్ పోస్ట్ లు అప్రమత్తం చేయగా ముసునూరు మండలం వేలుపుచర్ల చెక్ వద్ద వీరబాబుని తీసుకువెళ్తున్న కారును గుర్తించారు. వెంటనే వీరబాబుని విడిపించి..అతని తండ్రి, బంధువులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.