విజయవాడ: రాజధాని అమరావతిపై తెలుగు దేశం పార్టీ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో సీనీనటులు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం పూర్తయ్యేవరకు బాలకృష్ణ అక్కడే వుండి రాజధానిపై జరిగిన చర్చల్లో పాల్గొన్నారు.

 

అనంతరం అమరావతి నిర్మాణానికి మద్దతుగా చేపట్టిన సంతకాల సేకరణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంతకాలకోసం ఏర్పాటుచేసిన బోర్డుపై ఆయన కూడా సంతకం చేశారు. కాస్త విచిత్రంగా వున్న ఆయన సంతకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  కేవలం ఆయన సంతకాన్ని చూడటానికి సమావేశానికి  హాజరైన వారు బోర్డు వద్ద గుమిగూడారు.

కేవలం బాలయ్యే కాదు ఆయన సంతకం కూడా స్పెషల్ గానే వుంటుందని అభిమానులు అంటున్నారు. తమ అభిమాన నటుడు ఏం చేసినా అందులో తన మార్కును ప్రదర్శిస్తాడని... సంతకంలోనూ అదే ఉట్టిపడుతోందని అభిమానులు అంటున్నారు.