సీఎం జగన్ ఇంటివద్దే గంజాయి దందా...: పంచుమర్తి అనురాధ సంచలనం
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో యువతకు ఉపాధినిచ్చేలా స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు ఉపయోగపడితే వైసిపి హయాంలో యువతను చెడగొట్టడానికి ఈ సెంటర్లు ఉపయోగించేలా వున్నారని పంచుమర్తి అనురాధ మండిపడ్డారు.
గుంటూరు: కియా మోటార్స్ యాజమాన్యాని బెదిరించినందకు, కియా అనుబంధ సంస్థలను తరమికొట్టినందుకు, అదాని డేటా సెంటర్ ను వెళ్లగొట్టినందుకు, లులూ గ్రూప్ ను వెళ్ల గొట్టినందకు, రేణిగుంటలో రిలయన్స్ ఐటీ, ఒంగోలులో పేపర్ మిల్లు, బీఆర్టీ, ప్రాంక్లిన్ సంస్ధల్ని వెళ్ల గొట్టిన పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతంరెడ్డికి సీఎం జగన్మోహన్ రెడ్డి సన్మానం చేసి కొత్తగా స్కిల్ డెలప్ మెంట్ శాఖను అప్పగించడం సిగ్గుచేటని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ మండిపడ్డారు.
''ఇంత వరకు రూపాయి పెట్టుబడి తీసుకురాలేదు.. ఇప్పటి వరకు రూపాయి సంపద సృష్టించలేదు..సీఆర్ డిఏ పరిధిలో ఉన్న స్కిల్ డైలప్ మెంట్ సెంటర్లకు నేర్చుకోవడానికి ఒకరు కూడా రాలేదు. 10రోజులకు ఒక్కసారి బయటకు వచ్చి ప్రెస్ మీట్ లు పెట్టడం కాదు.. గ్రౌండ్ లేవల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. సీఎం ఇంటి పరిధిలోనే గంజాయి దందా నడుస్తోంది'' అంటూ అనురాధ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మాజీ సీఎం చంద్రబాబు నాయుడు హయాంలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు, 10లక్షల ఉద్యోగాలు వచ్చాయన్నారు. అలాగే 15 స్కిల్ డెలప్ సెంట్రల్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ స్కిల్ డెలప్ మెంట్ సెంటర్లల్లో 8.5లక్షల మందికి శిక్షణ ఇవ్వడం జరగిందని... దాదాపు 2లక్షల మందికి ఉద్యోగాలు రావడం జరిగిందన్నారు.
read more ''జగన్ ను మీరు అరెస్ట్ చేస్తారా... మమ్మల్నే చేయమంటారా..? కేంద్రానికి యూఏఈ లేఖ''
ఐక్కరాజసమితి, అంతర్జాతీయ అభివృద్ధి కార్యక్రమాల సంస్థ, అల్ ఇండియా కౌన్సిల్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నిర్వహించిన సర్వేల్లో ఏపీ పెట్టుబడుల్లో, స్కిల్ డెలప్ మెంట్ లో మొదటి స్థానంలో నిలవడం జరిగిందని... ఇదంతా చంద్రబాబు చేసిన కృషి ఫలితమే అని అన్నారు. అంతే కాకుండా బంగారు పతకాలు కూడా రావడం జరిగిందన్నారు. మూడు సార్లు భాగస్వామ్య సదస్సులు విశాఖలో పెట్టడం జరిగిందని అన్నారు.
స్కిల్ డెలప్ మెంట్ పెట్టినప్పడు అనేక సంస్థల సహకారంతో 8.5లక్షల మందికి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. వైసిపి ఏ స్కిల్ డెలప్ మెంట్ సెంటర్లు పెడతారు..? ఏ సంస్థ సహకారంతో పెడుతున్నారు..? చెప్పాలన్నారు.
ప్రకాశం జిల్లాలో స్కిల్ డెలప్ మెంట్ ఏర్పాటు చేసి మెగా పుడ్ పార్కుకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. ఇలా జగన్ సొంత జిల్లా కడపలోనే టెక్నికల్ ట్రైనింగ్ ఎక్కువగా ఇవ్వడం జరిగింది. మరి వైసిపి నాయకులు ఆ సెంటర్లలో యువకులకు క్రికెట్ బెట్టింగులు, దొంగనోట్ల ముద్రణపై శిక్షణ ఇస్తారా...? అని ఎద్దేవా చేశారు. మట్క నెంబర్ గేమ్ పై ట్రైనింగ్ ఇస్తారా లేదా పేకాట క్లబ్ లకు ట్రైనింగ్ ఇస్తారా? అంటూ వైసిపి ప్రభుత్వంపై మండిపడ్డారు.
తిరుపతిలో ఎలక్ట్రానిక్ సెంటర్లు ఎక్కువగా ఉండడం వలన తాము వాటికి సంబంధించిన ట్రైనింగ్ ఇవ్వటం జరిగిందన్నారు. అక్కడ మీరు ఎర్రచందనం స్మగ్లింగ్ పై ట్రైనింగ్ ఇవ్వబోతున్నారా..? ఇసుక దందాపై టైనింగ్ ఇవ్వబోతున్నారా? అని అడిగారు.
read more విద్యుత్ రంగాన్ని గట్టెక్కించేందుకు జగన్ సర్కార్ కీలక నిర్ణయం
వైజాగ్ లో సాప్ట్ వేర్ సంబంధించిన ట్రైనింగ్ విజయవంతంగా నిర్వహించడం జరిగిందన్నారు. అక్కడ వైసిపి దేనిపై ట్రైనింగ్ ఇస్తారు... విశాఖలో భూకబ్జా ఎలా చేయాలో ట్రైనింగ్ ఇస్తారా..? అని అన్నారు.
గోదావారి జిల్లాల్లో అక్వా, పుడ్స్ ప్రాసింగ్ కు సంబంధించి ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందని... మీరు ఇసుకు దందా చేసుకోవడం ట్రైనింగ్ ఇస్తారా..?అని అడిగారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఆటోమొబైల్స్ రంగంలో శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. మీరు బుతూలపై శిక్షణ ఇస్తారా...? అంటూ అనురాధ సెటైర్లు వేశారు.