Asianet News TeluguAsianet News Telugu

విజయవాడలో అవుట్ రీచ్ డ్రాప్ ఇన్ సెంటర్... ప్రారంభించిన సిపి తిరుమలరావు

విజయవాడలోని హనుమాన్ పేటలో అవుట్ రీచ్ డ్రాప్ ఇన్ సెంటర్ ని నగర పోలీస్ కమీషనర్ సీపీ ద్వారకా తిరుమలరావు ప్రారంభించారు. మాదకద్రవ్యాల విక్రయాలకు నగరంలో అడ్డాగా మారినందుకే ఇక్కడ దీన్ని ఏర్పాటుచేసినట్లు తెలిపారు.   

out reach drop centre inaugurated by cp dwaraka tirumala rao in vijayawada
Author
Vijayawada, First Published Nov 6, 2019, 9:28 PM IST

విజయవాడ:  హనుమాన్ పేటలో అవుట్ రీచ్ డ్రాప్ ఇన్ సెంటర్ ని నగర పోలీస్ కమీషనర్ సీపీ ద్వారకా తిరుమలరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... 
 యువత మాదకద్రవ్యాల బారిన పడుతున్నారన్నారు. మద్యం, సిగరెట్ అనేది ఒక వ్యసనంగా మారిందని...వ్యసనం ఏదైనా తప్పేనని యువత గుర్తించాలన్నారు. 

అత్యంత ప్రమాదకరమైన వ్యసనం మాత్రం మాదకద్రవ్యాలేనని అన్నారు. ఆరోగ్యానికి అత్యంత హాని తలపెట్టే ఈ ప్రమాదకరమైన మాదకద్రవ్యాల ఉచ్చులో పడితే బయటపడటం చాలా కష్టమన్నారు. అతిగా అలవాటుపడితే అవిలేక పోతే బతకలేని పరిస్థితి ఏర్పడుతుందని...కాబట్టి ముందుగానే వాటికి దూరంగా వుండాలని హెచ్చరించారు. 

అనేక తప్పిదాలకు, నేరాలకు ఈ మాదకద్రవ్యాల అలవాటు దారితీస్తాయని అన్నారు. మాదకద్రవ్యాలు అనేది నేడు పెద్ద వ్యాపారంగా మారిపోయిందని..యువతకు డ్రగ్స్ అలవాటు చేసిమరీ ఈ వ్యాపారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

read more  పొంచివున్న బుల్ బుల్ తుఫాను...కోస్తాలో ప్రమాద హెచ్చరికలు జారీ

ప్రపంచ వ్యాప్తంగా మాదకద్రవ్యాల వ్యాపారం వ్యవస్థలనే శాసించే స్థాయికి చేరుకున్నాయని...ఇది చాలా ప్రమాదకరమన్నారు. ఇలాంటి వ్యవస్థల నుండి దేశాన్ని కాపాడాలంటే యువత అప్రమత్తంగా వుండటం ఒక్కటే మార్గమన్నారు. 

మాదకద్రవ్యాల కేసులో పట్టుబడితే శిక్షలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయన్నారు. డ్రగ్స్ మహమ్మరిని అరికట్టడానికే ఈ అవుట్ రీచ్ డ్రాప్ ఇన్ సెంటర్స్ అవసరంముంటాయని పేర్కొన్నారు. 

read more  RTC Strike: ఆర్టీసీపై కీలక ప్రకటన... సమీక్షా సమావేశంలో కేసీఆర్ నిర్ణయమిదేనా..?

అందరి భాగస్వాగమంతో డ్రగ్స్ మహమ్మారిని నగరం నుంచి పారదోలడానికి ప్రయత్నిస్తున్నామని అన్నారు. ఈ హనుమాన్ పేటలో డ్రగ్స్ వ్యాపారం జరుగుతుందని సమాచారం వుందని...అందుకోసమే ఇక్కడ అవుట్ రీచ్ డ్రాప్ ఇన్ సెంటర్ ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 

నగరంలో బ్లేడ్ బ్యాచ్ అరాచకాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. ఈ బ్లేడ్ బ్యాచ్ లో కూడా పరివర్తన తీసుకువచ్చేందుకు  కృషి చేస్తున్నామన్నారు. ముఖ్యంగా గవర్నర్ పేట,మాచవరం పోలీస్ స్టేషన్ కి రెండు నెలలుగా సిఐలు లేనట్లు తన దృష్టికి వచ్చిందని... అతిత్వరలో సిఐ లను నియమిస్తామని సిపి వెల్లడించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios