విజయవాడలో నాలుగు కరోనా కేసులు... ఒకరు మాత్రం...: మంత్రి వెల్లంపల్లి

విజయవాడలో బయటపడిన కరోనాా కేసుల గురించి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడారు. 

Ministrer Vellampally Srinivas talks about corona in vijayawada

 విజయవాడ: కరోనా మహమ్మారి ప్రపంచాన్నే ఇబ్బంది పెడుతున్న పరిస్దితుల్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అనేక నిర్ణయాలతో కరోనాను కట్టడి చేయడానికి యుద్దం చేస్తున్నారని రాష్ర్ట దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. 

ప్రజలు నిత్యావసరాలపరంగా, ఇతర అంశాలలో ఇబ్బంది పడకుండా చూడాలని ప్రయత్నిస్తున్నారని... ఇందులోభాగంగా రేషన్ కార్డుదారులకు ఒక్కొక్కరికి ఐదుకిలోల బియ్యం, కుటుంబానికి కిలో కందిపప్పు ఉచితంగా పేదప్రజలకు ఇస్తున్నారని అన్నారు. రేషన్ షాపులవద్దకు ఒకేసారి ప్రజలు చేరుకోవడం వల్ల పలు ఇబ్బందులు వస్తున్నమాటే నిజమేనని అన్నారు. అందుకని వారిని క్రమబద్దీకరించేందుకు ప్రతిరోజూ 100 నుంచి 150 మంది వరకు రేషన్ తీసుకునే విధంగా ఆదేశాలు ఇచ్చామన్నారు. 

రేషన్ దారులు సోషల్ డిస్టెన్స్ మెయింటెన్ చేసేవిధంగా మోటివేట్ చేయాలని రేషన్ దుకాణదారులకు స్పష్టంగా చెప్పామన్నారు. సోమవారం సాఫ్ట్ వేర్ లో సాంకేతిక సమస్యలవల్ల రేషన్ దారులకు ఇబ్బందులు ఎదురయ్యాయని అన్నారు. రేషన్ దారులు ఎక్కడైనా ఆన్ లైన్ విధానంలో సరుకులు తీసుకోవచ్చని కూడా చెప్పామని....ఈ సాంకేతిక సమస్యలు రేపటినుంచి లేకుండా చేసేందుకు అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. 

కరోనాకు సంబంధించి విజయవాడలో నాలుగు కేసులు  నమోదు అయ్యాయన్నారు. కృష్ణాజిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, విజయవాడ మున్సిపల్ కమీషనర్ లు కరోనా వ్యాప్తి చెందకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుని కంట్రోల్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కరోనా అనుమానితులందర్ని హోమ్ క్వారంటైన్ లో పెడుతున్నామని తెలిపారు. 

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఒక కరోనా బాధితుడు రికవరి పొజిషన్ లో ఉన్నాడన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలందరూ కూడా తగిన సహకారం అందించాలని....నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచడంతోపాటు ప్రతి ఏరియాలో రైతుబజార్లు ఏర్పాటుచేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు కూరగాయలు విక్రయించేలా చేస్తున్నామన్నారు. గతంలో ఐదు రైతుబజార్లు ఉంటే ఈరోజు 45 రైతుబజార్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

భారతదేశంలో ఎక్కడా చేయని విధంగా వాలంటీర్లు చక్కటి సేవలు అందిస్తున్నారని అన్నారు. నేటికీ కేవలం 23 కేసులతో మన రాష్ర్టం ఉందంటే వారి సేవలే కారణమన్నారు.  విదేశాలు నుంచి వచ్చినవారిని హోమ్ క్వారంటైన్ లో ఉంచేలా చేయడం, వారిని అబ్జర్వ్ చేయడం వంటి విషయాలలో చాలాబాగా పనిచేస్తున్నారని... పవన్ కల్యాణ్ దీనిని సైతం కామెంట్ చేయడం దారుణమన్నారు. 

పవన్ కల్యాణ్,చంద్రబాబులు హైద్రాబాద్ లో కూర్చుని ట్వీట్ లు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. వార్డు వాలంటీర్లుగాని ,వార్డు సెక్రటరీలు గాని ప్రజలకోసం వారి ప్రాణాలను ఫణంగా పెట్టి పనిచేస్తున్నారని అన్నారు. వారిని అవమానించే విధంగా ట్వీట్ లు చేయడం బాధాకరమన్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా  వైయస్ జగన్  తెచ్చిన గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్దను ఇతర దేశాలు కూడా ప్రశంసిస్తున్నాయని.... ముఖ్యంగా బ్రిటన్ దేశం, కేరళ ముఖ్యమంత్రి కూడా ఇక్కడ ఏ విధంగా కరోనాను ఎదుర్కొంటున్నారని పర్యవేక్షిస్తున్నారని అన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios