గ్రామ, వార్డు ఉద్యోగాలకు అర్హత సాధించిన వారికి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. సోమవారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. పరిపాలనలో కొత్త ఒరవడి తీసుకొచ్చేందుకు జగన్ గ్రామ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారన్నారు.

ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు నిండకముందే 4 లక్షల పదివేల ఉద్యోగాలను భర్తీ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. గ్రామ సచివాలయం, వార్డు వాలంటీర్ల వ్యవస్థపై ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి వెనకడుగు వేయలేదని బొత్స తెలిపారు.

ఉద్యోగాలు సాధించిన వారంతా ముఖ్యమంత్రి నమ్మకాన్ని నిలబెట్టాలని మంత్రి సూచించారు. గోనె సంచులు మోసుకునే ఉద్యోగాలని చంద్రబాబు ఎద్దేవా చేస్తున్నారని బొత్స గుర్తు చేశారు.