విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగర శివారులో అర్థరాత్రి  కాల్పుల సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. కాల్పుల్లో ఓ యువకుడు మరణించాడు. 

మృతుడిని పోలీసు కమిషనర్ కార్యాలయంలో పనిచేసే మహిష్ గా గుర్తించారు. మరో ఇద్దరు పరారయ్యాయురు. విజయవాడ శివారులోని బైపాస్ రోడ్డులో ఉన్న ఓ బార్ సమీపంలో కాల్పుల సంఘటన చోటు చేసుకుంది. 

పథకం ప్రకారమే మహేష్ ను చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సీపీ బత్తిన శ్రీనివాసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు నిందితుల కోసం పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.  రియల్ ఎస్టేట్ వివాదం ఈ హత్యకు కారణమై ఉండవచ్చునని భావిస్తున్నారు.

పథకం ప్రకారం దుండగులు మహేష్ ను హతమార్చినట్లు అర్థమవుతోంది. తొలుత బార్ వద్దకు వచ్చి చూసి వెళ్లారు. ఆ తర్వాత వచ్చి కాల్పులు జరిపి అతన్ని హతమార్చారు. మిత్రులతో కలిసి మద్యం సేవించడానికి మహేష్ బార్ కు వచ్చాడు. దుండగులు నాటు తుపాకి వాడారు. శనివారం అర్థరాత్రి ఆ ఘటన చోటు చేసుకుంది. స్కూటర్ మీద ఇద్దరు వ్యక్తులు వచ్చి కాల్పులు జరిపారు. నిందితుల కోసం పోలీసు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.