Asianet News TeluguAsianet News Telugu

మచిలీపట్నంలో కరోనా కలకలం: ఇంట్లోనే వైద్యం

మచిలీపట్నంలో కరోనావైరస్ కలకలం చెలరేగుతోంది. ఢిల్లీ నుంచి వచ్చిన ఓ విద్యార్థికి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్లు తెలుస్తోంది. అతనికి ఇంట్లోనే చికిత్స అందిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.

Machiliptnam: Delhi student infected with Coronavirus
Author
Machilipatnam, First Published Mar 11, 2020, 8:39 AM IST

మచిలీపట్నం: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కరోనా వైరస్ కలకలం సృష్టించింది. ఢిల్లీ నుండి వచ్చిన ఒక విద్యార్థికి కారోనా లక్షణాలు ఉన్నట్టు సమాచారం అందింది. బాధితుడు ఒక డాక్టర్ అన్న కొడుకు అని తెలుస్తోంది. దాంతో ఇంట్లోనే ఉంచి వైద్యం అందిస్తున్నటు తెలుస్తుంది. 

ముందుగా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువస్తున్నటు సమాచారం రావడంతో మచిలీపట్నం జిల్లా ఆసుపత్రిలో ఏర్పాట్లు చేశారు. సమాచారం బయటకు పొక్కడంతో ఆసుపత్రికి రాకుండా ఇంటివద్దనే చికిత్స అందిస్తున్నారని వినికిడి. బాధితుడిని గుర్తించే పనిలో అధికారులు మునిగిపోయారు.

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ భారత్‌లోనూ వేగంగా విస్తరిస్తోంది. తాజాగా మంగళవారం ఒక్క రోజే తొమ్మిది కేసులు నమోదయ్యాయి. కేరళలో 9, కర్ణాటకలో 3 కొత్త కేసులు నమోదయ్యాయి.

కేరళలో ఆరు కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. దీంతో ఆ రాష్ట్రంలో వైరస్ బారిన వారి సంఖ్య 12కు చేరింది. ఇది రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాలలు, అంగన్‌వాడీలు, మదర్సాలను మార్చి 31 వరకు మూసివేయాలని ఆయన ఆదేశించారు.

అలాగే ఏడో తరగతి పరీక్షల్ని కూడా వాయిదా వేస్తున్నట్లు వెల్లడించిన విషయం తెలిసందే. అటు కర్ణాటకలోనూ మూడు కొత్త కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి బి. శ్రీరాములు ప్రకటించారు.

దీంతో కర్ణాటకలో కరోనా బాధితుల సంఖ్య నాలుగుకు చేరింది. వైరస్ సోకిన వారితో పాటు వారి కుటుంబసభ్యుల్ని ప్రత్యేక వార్డులో ఉంచామని శ్రీరాములు పేర్కొన్నారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి హెచ్చరించారు.

సోమవారం సాయంత్రం అమెరికా నుంచి బెంగళూరు వచ్చిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు కరోనా సోకడంతో కలకలం రేగింది. అయితే అతను దాదాపు 2,500 మందికి పైగా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా తిరిగినట్లు అంచనా వేస్తున్నారు.. కేరళ, కర్ణాటకలో కొత్త కేసుల కారణంగా భారత్‌లో కరోనా సోకిన వారి సంఖ్య 56కి చేరింది. 

Follow Us:
Download App:
  • android
  • ios