దసరా మామూళ్లు అలవాటు చేసిందే టీడీపీ: బందర్ వైసీపీ కన్వీనర్ షేక్ సలార్
అన్ని వ్యవస్థల్లో దసరా మామూళ్లు వసూళ్ళు పద్ధతి అలవాటు చేసిందే తెలుగుదేశం ప్రభుత్వమన్నారు మచిలీపట్నం పట్టణ వైసీపీ కన్వీనర్ షేక్ సలార్ దాదా.
అన్ని వ్యవస్థల్లో దసరా మామూళ్లు వసూళ్ళు పద్ధతి అలవాటు చేసిందే తెలుగుదేశం ప్రభుత్వమన్నారు మచిలీపట్నం పట్టణ వైసీపీ కన్వీనర్ షేక్ సలార్ దాదా. సోమవారం పట్టణ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
గ్రామ వాలంటీర్ల 50 రూపాయలు తీసుకున్నారని, దానినిపెద్ద నేరంలా భూతద్దంలో చూపించేందుకు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రయత్నిస్తురంటూ ఆయన ఎద్దేవా చేశారు. పెన్షన్ తీసుకున్నాక వృద్ధ గ్రామస్తులు 50 రూపాయాలు గ్రామ వాలంటీర్లకు ఇచ్చిఉండవచ్చునని సలార్ అభిప్రాయపడ్డారు.
ఆ విధంగా వృద్ధుల వద్ద డబ్బు తీసుకున్న వారిపై చర్యలు కూడా తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. అసలు గ్రామ వాలంటీర్ల వ్యవస్థనే నిర్ములించాలని అనటం హాస్యాస్పదమని సలార్ దాదా ఎద్దేవా చేశారు.
మంత్రి పేర్నినాని చేస్తున్న కార్యక్రమాలకు విశేష స్పందన లభిస్తుంటే.. దానికి కొల్లు రవీంద్ర వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని సలార్ దాదా మండిపడ్డారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏ విధమైన సుపరిపాలన అందించారో దానికి ఒక అడుగు ముందుకేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని ఆయన ప్రశంసించారు.
టీడీపీ నేతలు మాత్రం ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమంపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని సలార్ మండిపడ్డారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని.. టీడీపీ నేతలు చెప్పింది వినటానికి సుముఖంగా లేరన్న విషయాన్ని వారు గుర్తుంచుకోవాలని దాదా హితవుపలికారు.