కృష్ణా జిల్లా విజయవాడ నగరంలో లాక్ డౌన్ కారణంగా గత రెండు నెలలుగా మూతబడిన వ్యాపాన సముదాయాలన్నీనేటి(బుధవారం) నుండి పూర్తిగా తెరుచుకోనున్నట్లు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ వెల్లడించారు. వైరస్ ప్రభావమున్నట్లు ప్రభుత్వం గుర్తించిన కంటైన్మెంట్ ప్రాంతాల్లో తప్ప మిగతా అన్ని చోట్లా షాపులు తెరవచ్చని కలెక్టర్ ఆదేశించారు. విజయవాడ నగరవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో వైరస్ ప్రభావం ఇంకా వుందని...అక్కడ ఎలాంటి వ్యాపారాలకు అనుమతి వుండదని   వెల్లడించారు. 

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా ప్రారంభం కావాలన్న ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలతో రాష్ట్రంలో అన్ని రకాల వ్యాపారాలు ప్రారంభమయ్యాయి. కేవలం షాపింగ్ కాంప్లెక్స్‌లు, మాల్స్, సినిమా థియేటర్లు, మతపరమైన కార్యక్రమాలు, సదస్సులను మాత్రమే అనుమతించని ప్రభుత్వం మిగతా అన్నిరకాల కార్యకలాపాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే వ్యాపారులు కరోనా వ్యాపించకుండా జాగ్రత్తలు పాటిస్తూ తమ వ్యాపారాలు చేసుకోవచ్చని ప్రభుత్వ స్పష్టం చేసింది. 

గత రెండు నెలలుగా కరోనా మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు విధించిన లాక్ డౌన్ కొనసాగుతోంది. అయితే కరోనాను పూర్తిగా అంతమొందించడం సాధ్యంకాదని...  లాక్ డౌన్ ఇలాగే కొనసాగిస్తే ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారుందన్న ఆందోళనతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సడలింపులిచ్చాయి. ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలు పాటిస్తూ వ్యాపారాలు జరుపుకోవచ్చని... ఇక ఆర్థిక రంగాన్ని దౌడ తీయిద్దామని సీఎం జగన్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో విజయవాడలో వ్యాపార కార్యకలాపాలు ప్రారంభం కానున్నారు. 

read more  విద్యుత్ ఛార్జీల దోపిడీపై టిడిపి రాష్ట్రవ్యాప్త నిరసన... పిలుపునిచ్చిన చంద్రబాబు

మరోవైపు కరోనా వైరస్ కారణంగా వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన ప్రవాసాంధ్రులను స్వస్థలాలకు తరలించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బుధవారం లండన్ నుండి తొలి విమానం ముంబై చేరుకొగా అక్కడ నుండి ఉదయం 7.50 కి156 మంది ప్రయాణికులతో గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నారు. విదేశాలు నుండి వచ్చే ప్రయాణికులకు గన్నవరం విమానాశ్రయంలో జిల్లాల వారిగా ఏర్పాటు చేసిన ప్రత్యేక హెల్ప్ డెస్క్ లను కలెక్టర్ ఇంతియాజ్ పరిశీలించారు.

అనంతరం కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.  విదేశాలు నుండి వచ్చే ప్రతి ఒక్కరినీ వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మాత్రమే ఆయా జిల్లాలకు సంబంధించిన కౌంటర్ లలో పేర్లు నమోదు చేసుకొని ప్రత్యేక బస్సుల్లో ఆయా జిల్లాలకు పంపించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.విదేశాలు నుండి వచ్చినవారు తప్పనిసరిగా 14 రోజులు ప్రభుత్వ,పెయిడ్ కోరంటైన్ లలో ఉండాలని తెలిపారు. 

విజయవాడలోని మినార్వా గ్రాండ్,మురళి ఫార్చూన్, డి.వి.మినార్, గేట్ వే హోటల్స్ తో పాటు అలంకార్ ఇన్, రెడ్ ఫోప్స్, ఫ్రీడే ఇన్, ఓయో హోటల్స్ లో పెయిడ్ కోరంటైన్ సెంటర్ లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.