అమరావతి: ఆంధ్ర  ప్రదేశ్ కు మూడు రాజధానులుంటే మంచిదని మాత్రమే ముఖ్యమంత్రి జగన్ అభిప్రాయపడ్డారని  మంత్రి కొడాలి నాని మరోసారి తెలిపారు. కానీ ప్రతిపక్ష టిడిపి నాయకులు చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తామేదో నిర్ణయం తీసుకున్నట్లు విమర్శలు చేస్తున్నారని అన్నారు.  ప్రభుత్వంలోని  వారితో గాని, అధికారులతో గానీ చర్చించకుండానే వారు రాజధాని విషయంలో సొంత అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారని... వాటిని ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. 

ఇక ఇటీవలే తమకు భయపడి టిడిపి నుండి బిజెపిలోకి చేరిన సుజనా చౌదరి చాలా ఎక్కువ మాట్లాడుతున్నారని అన్నారు.  ఆయనేమైనా దేశ ప్రధాని,హోమ్ మంత్రి అనుకుంటున్నాడా?  అని ఎద్దేవా చేశారు. టిడిపి హయాంలో ఎన్నో అక్రమాలకు పాల్పడిన అతన్ని జైల్లో పెడతారాన్న భయంతో బీజేపీ లోకి వెళ్లారని ఆరోపించారు. 

సుజనా కు క్రెడిబిలిటీ లేదు కాబట్టి రాజధానిపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఎవరూ పట్టించుకోవద్దన్నారు. రాజధానిపై ప్రభుత్వం నుండి అధికారికంగా  స్పష్టమైన నిర్ణయం వచ్చే వరకూ రైతులెవ్వరూ ఆందోళన చెందవద్దని సూచించారు.

read more మూడు రాజధానులకు జనసేన వ్యతిరేకం... కానీ దానికి మాత్రం అనుకూలం: శ్రీనివాస్ యాదవ్

అసెంబ్లీలో సీఎం  జగన్ కేవలం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని... ఆయన చెప్పిందే ఫైనల్ అనుకుంటే ఎలా అన్ని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటుచేసిన  నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా సీఎం జగన్ తుది నిర్ణయం తీసుకుంటారని అన్నారు. 

గత ఆరు నెలలుగా హైకోర్టు కోసం రాయలసీమలో ఆందోళన జరుగుతున్నాయని... వాటిని ప్రభుత్వం గమనిస్తూ వస్తోందన్నారు. వీటిపై ఒక్కసారి కూడా స్పందించకుండా ప్రతిపక్ష నేత చంద్రబాబు కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారా అని మండిపడ్డారు. రాజధానిపై సీఎం వెల్లబుచ్చిన  అభిప్రాయాన్ని టీడీపీ నాయకులు సైతం స్వాగతిస్తున్నారని అన్నారు. 

కేవలం  చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాత్రమే సీఎం ఆలోచనను తప్పుబడుతున్నారని అన్నారు.  అయితే ఇందులో కూడా చంద్రబాబు  చెప్పినట్లు మాత్రమే పవన్ చేస్తున్నాకని... ఆయనకు ఎలాంటి  అభ్యంతరం లేదని భావిస్తున్నామన్నారు. 

read more  రాజధానిని మారుస్తామంటే కేంద్రం చూస్తూ ఊరుకోదు: సుజనా హెచ్చరిక

చంద్రబాబు అసత్య ప్రచారాలతో రాజధాని రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. పది మంది బాగుండాలనేదే జగన్ ఆశయమని...  రాజధాని విషయంలో కూడా ఆ ఆశయం ప్రకారమే నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నట్లు నాని పేర్కొన్నారు.