Asianet News TeluguAsianet News Telugu

మచిలీపట్నం ఆర్డీఓగా ఖాజావలీ.. బాధ్యతల స్వీకరణ

ట్రైనీ డెప్యూటీ కలెక్టర్ గా  ఖాజావలీ సమర్థవంతమైన సేవలు అందించారు. పెథాయ్ తుపాన్ సమయంలో నాటి కలెక్టర్ లక్ష్మీకాంతం సారథ్యంలో రౌండ్ ది క్లాక్ కంట్రోల్ రూమ్ ద్వారా అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేసి ప్రాణ, ఆస్తి నష్టం నివారణలో ఖాజావలీ కీలక పాత్ర పోషించారు.
 
khazavali appointed as a RDO
Author
Hyderabad, First Published Oct 10, 2019, 11:38 AM IST

మచిలీపట్నం ఆర్డీఓగా ఖాజావలి బాధ్యతలు స్వీకరించారు. ఆయనను ఆర్డీఓగా  నియమిస్తూ తాజాగా  ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఆర్డీఓగా సేవలందించిన జె ఉదయ భాస్కర్ ని కాపు కార్పొరేషన్ జనరల్ మేనేజర్ గా బదిలీ చేశారు. ఆర్డీఓగా నియమితులైన ఖాజావలీ గతంలో మచిలీపట్నంలోనే ట్రైనీ డెప్యూటీ కలెక్టర్ గా పని చేశారు.

ట్రైనీ డెప్యూటీ కలెక్టర్ గా  ఖాజావలీ సమర్థవంతమైన సేవలు అందించారు. పెథాయ్ తుపాన్ సమయంలో నాటి కలెక్టర్ లక్ష్మీకాంతం సారథ్యంలో రౌండ్ ది క్లాక్ కంట్రోల్ రూమ్ ద్వారా అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేసి ప్రాణ, ఆస్తి నష్టం నివారణలో ఖాజావలీ కీలక పాత్ర పోషించారు.

ఆర్డీఓగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఖాజావలీ కలెక్టర్ ఇంతియాజ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఖాజావలీని ఇంతియాజ్ అభినందించారు. డివిజన్ లో రెవెన్యూ సమస్యల పరిష్కారంతోపాటు ప్రభుత్వ పథకాల అమలుకు కృషి చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ ఇంతియాజ్ ఆయనకు సూచించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios