విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీ సిద్దమవుతోంది. ఇప్పటికే మిత్రపక్షం బిజెపితో మంతనాలు జరిపిన జనసేన అధినాయకత్వం తాజాగా క్షేత్రస్థాయిలో కూడా ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఈ ఎన్నికల కోసం జిల్లాలవారీగా సమన్వయకర్తలను నియమించింది. 

స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ తరఫున అభ్యర్థలు ఎంపికతో పాటు నాయకులను సమన్వయం చేసే విషయంలో ఈ సమన్వయకర్తలు ఉపయోగపడనున్నారు.    నామినేషన్ దశ నుంచి పోలింగ్ ప్రక్రియ వరకూ పార్టీ కార్యక్రమాలను వీరు సమన్వయం చేసుకుంటారు. 

జిల్లాలవారీగా సమన్వయకర్తలు 

శ్రీకాకుళం : డాక్టర్ బి.రఘు 

విజయనగరం :  గడసాల అప్పారావు 

విశాఖపట్నం (రూరల్) : శ్రీ సుందరపు విజయ్ కుమార్ 

తూర్పుగోదావరి :  బొమ్మదేవర శ్రీధర్ (బన్ను)

పశ్చిమ గోదావరి :  ముత్తా శశిధర్ 

కృష్ణా :  పోతిన మహేశ్ 

గుంటూరు :  కళ్యాణం శివ శ్రీనివాస్ (కె.కె.)

ప్రకాశం :  షేక్ రియాజ్ 

నెల్లూరు :  సి.మనుక్రాంత్ రెడ్డి 

చిత్తూరు :  బొలిశెట్టి సత్య

కడప : డా.పి.హరిప్రసాద్ 

కర్నూలు :  టి.సి.వరుణ్ 

అనంతపురం :  చిలకం మధుసూదన్ రెడ్డి

అంతకుముందు స్థానికసంస్ధల ఎన్నికల విషయమై  బిజెపి-జనసేన ముఖ్య నాయకులు సమావేశమయ్యారు. ఎన్నికలపై రెండు పార్టీల నాయకులు చర్చించారు. సీట్లు సర్దుబాటు, ఉమ్మడి మ్యానిఫెస్టోపై వీరు ప్రధానంగా చర్చించారు. 

బీజేపీ తరపున సతీష్ జీ, పురంధేశ్వరి, సోము వీర్రాజు, మాధవ్, కామినేని, వాకాటి నారాయణరెడ్డి, ఆదినారాయణ రెడ్డి, శాంతా రెడ్డి జనసేన నుండి నాదెండ్ల మనోహర్, శివశంకర్, కందుల దుర్గేష్, చిలకం మధుసూదన్ రెడ్డి, బోనబోయిన శ్రీనివాస్, పంతం‌ నానాజీ, రియాజ్, మదుసూధన్ రెడ్డి లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.