కృష్ణమ్మ పరవళ్లు... సహాయక చర్యల్లో పాల్గొన్న జిల్లా ఎస్పీ

ఏపిలో కురుస్తున్న వర్షాలకు కృష్ణా నది పొంగి పొర్లుతోంది. ఈ నేపథ్యంలో నదీపరివాహక ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితిని జిల్లా ఎస్పీ రవింద్రబాబు స్వయంగా పరిశీలించారు.  

heavy water flow in krishna river... sp ravindra babu participated in rescue operations

కృష్ణా జిల్లా: ఆంద్ర ప్రదేశ్ తో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రంలో నదులన్ని ఉప్పొంగుతూ ప్రమాదకర రీతిలో ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో అప్రమత్తమైన ప్రభుత్వం నదీ  పరివాహక ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా ముందస్తు జాగ్రత్తలు చేపడుతోంది. ఇందులోభాగంగా కృష్ణా నది పరివాహక ప్రాంతాలైన చందర్లపాడు, కంచికచర్ల మండలాల్లోని పలు గ్రామాల్లో కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్ర బాబు పర్యటించారు.   

ఈ రెండు మండలాల్లోని కృష్ణా నదీ పరివాహక గ్రామాల్లో శుక్రవారం రాత్రి వరద ఉదృతి ఏ స్థాయిలో వుందో ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కృష్ణానది కి వరద ఉధృతి పెరుగుతున్నందున పోలీస్ అధికారులు ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని సూచించారు.

read more చిన్నారిపై ఆత్యాచారం... నిందితుడికి ప్రభుత్వ అండదండలు...: చంద్రబాబు

మిగతా శాఖల అధికారులంతా కలిసికట్టుగా పనిచేసి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చూడాలన్నారు. అలాగే లంక ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

ఎగువ రాష్ట్రాల నుంచి వరద ప్రవాహం ఎక్కువగా వస్తుండడంతో ఎస్పీ ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేశారు. కంచికచర్ల చెవిటికల్లు వరద ప్రవాహాన్ని పరిశీలించారు. ప్రవాహం ఎక్కువున్న చోట పడవలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

read more చిన్నారిపై ఆత్యాచారం... నిందుతుడికి ప్రభుత్వ అండదండలు...: చంద్రబాబు

అంతేకాకుండా గని అత్కూరు లంక పొలాల్లో ఎవరన్న ప్రజలు ఉన్నారా... ఉంటే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆయన సూచించారు. ఎటువంటి ప్రాణ నష్టం జరక్కుండా ఎప్పటికప్పుడు ముందస్తుగా గట్టి చర్యలు తీసుకోవాలని పోలీసు యంత్రాంగానికి ఆయన ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ తో   నందిగామ డిఎస్పీ జివి రమణ మూర్తి, నందిగామ రూరల్ సీఐ సతీష్, కంచికచర్ల ఎస్సై శ్రీ హరి బాబు, చందర్లపాడు  ఎస్సై మణికుమార్, ఇంటిలిజెన్స్ ఎస్ఐ రమణ మరియు సిబ్బంది పాల్గొన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios