విజయవాడ నగర శివారులో సీపీ టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో భారీగా గంజాయి పట్టుబడింది. 

విజయవాడ రామవరప్పాడు కూడలి లో లారీలో రవాణా అవుతున్న 1000 కేజీల గంజాయిని టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

గన్నవరం వైపు నుండి విజయవాడ ఇన్నర్ రింగ్ రోడ్డు వైపు వెళ్తున్న లారీని చాకచక్యంగా పట్టుకొని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

ఈ దాడిలో పట్టుకున్న గంజాయి విలువ సుమారు రూ. 70 లక్షలు ఉంటుందని అంచనా.