రాజధాని ప్రాంతం  గుంటూరు జిల్లా తాడికొండ మండలం  పొన్నెకల్ల గ్రామానికి చెందిన రైతు  పాలేటి సుబ్బయ్య(83) బుధవారం  రాత్రి గుండె పోటుతో మృతి చెందాడు. ఆయన గత 22 రోజులుగా రాజధాని అమరావతికి మద్దతుగా  నిరసనల్లో పాల్గొంటున్నారు. సీఎం జగన్‌ రాజధాని మార్పు ప్రకటన చేసినప్పటి నుంచి ఆయన తీవ్ర మనోవేదనకు గురయ్యారని కుటుంబ సభ్యులు తెలిపారు. 

AlsoRead దృష్టి మరల్చడానికే చంద్రబాబు హంగామా... విజయవాడ ఘటన ఆయన స్క్రిప్టే: హోంమంత్రి సుచరిత...

రాజధాని తరలిపోవడం ఖాయమని భావించి ఆయన కొంతకాలంగా తనలో తానే మదనపడిపోతున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి గుండె పోటుతో మృతి చెందాడని కుటుంబసభ్యులు తెలిపారు.. కాగా... ఇదే కారణంతో ఇప్పటి చాలా మంది రైతులు ప్రాణాలు విడిచారు. ఇదే గ్రామంలో ముగ్గురు రైతులు ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.