పంటకు ధర లేదని... కౌలు రైతు ఆత్మహత్య
గౌరారం గ్రామానికి చెందిన ఓ కౌలు రైతు ఆర్థిక సమస్యలను తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గత నాలుగు సంవత్సరాలుగా భూమి సాగులో పంట ధర రాక అప్పుల బాధలు ఎక్కువయ్యాయి.
గత నాలుగేళ్లుగా...ఏ పంట పండించినా సరైన ధర లభించడం లేదని ఆ కౌలు రైతు ఆవేదన చెందాడు. సంవత్సరమంతా కష్టపడినా.. కనీసం పెట్టుబడులు కూడా రావడం లేదని మనస్థాపానికి గురయ్యాడు. కనీసం భార్య, బిడ్డలను కూడా పోషించేకపోతున్నానని మదనపడ్డాడు. చివరకు వాటిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గౌరారం గ్రామంలో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.... గౌరారం గ్రామానికి చెందిన ఓ కౌలు రైతు ఆర్థిక సమస్యలను తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గత నాలుగు సంవత్సరాలుగా భూమి సాగులో పంట ధర రాక అప్పుల బాధలు ఎక్కువయ్యాయి.
ఈ క్రమంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం విజయవాడకు తరలించారు. కాగా... ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు.
రైతుకి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబ పెద్దను కోల్పోయి... వారంతా కన్నరు మున్నీరుగా విలపిస్తున్నారు.