విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని... ఆయన అడుగుజాడల్లోనే నడిచి రాష్ట్రాభివృద్దికి సహకరించడం కోసమే వైఎస్సార్‌సిపి లో చేరుతున్నట్లు దేవినేని అవినాశ్ వెల్లడించారు. ముఖ్యంగా ప్రజాసంక్షేమమే ద్యేయంగా జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని అవినాశ్  వెల్లడించాడు. 

సీఎం జగన్ చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నచ్చి పార్టీలో చేరుతున్నానని అన్నారు. ఆయన అడుగుజాడల్లోనే పార్టీలో నడుస్తానని... అందుకోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని ప్రకటించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జగన్ సీఎం అయ్యేందుకు సైనికుడిలా పని చేస్తానని అన్నారు. 

తన వర్గం కార్యకర్తలకు, నాయకులకు పార్టీలు అన్యాయం జరుగుతుందని ఎన్నిసార్లు చంద్రబాబునాయుడు, లోకేశ్ ల దృష్టికి తీసుకెళ్ళినా పట్టించుకోలేదన్నారు. అందువల్లే వారికి గౌరవం దక్కని పార్టీలో వుండకుడదని నిర్ణయించుకున్నానని... అభిమానులు, కార్యకర్తల అభీష్టం మేరకే  వైసిపిలో చేరినట్లు అవినాశ్ వెల్లడించారు. 

తనమీద నమ్మకంతో టిడిపి అప్పజెప్పిన ప్రతిబాధ్యతని నిజాయితీ, క్రమశిక్షణతో నిర్వహించానని...గత ఎన్నికల్లో అనువైన స్థానం కాకపోయినా చంద్రబాబు ఆదేశాల  మేరకు గుడివాడ నుండి పోటీచేశానని తెలిపారు. ఓటమి బాధ కలిగించినా లెక్కచేయకుండా పార్టీ కోసమే ముందడుగేసానని... కానీ ఇన్నాళ్లుగా అనుక్షణం వెన్నంటి ఉన్న కార్యకర్తలకు, దేవినేని నెహ్రూ అనుచరులకు తగిన ప్రాధాన్యం దొరకకపోవడం బాధ కలిగించిందని ఆవేధన వ్యక్తం చేశారు. 

read more   జూ.ఎన్టీఆర్ పేరెత్తి చంద్రబాబును ఏకేసిన వల్లభనేని వంశీ

టిడిపిలోని కొంతమంది లోకల్ నాయకులు కావాలనే ఇదంతా చేస్తున్నా అధిష్టానం పట్టించుకోకపోవడం కార్యకర్తలకు రుచించలేదన్నారు. అలాగే తన నిబద్ధతను పార్టీ అధిష్ఠానం తేలికగా తీసుకుందని... కార్యకర్తల మనోభావాలను  పరిగణలోకి తీసుకోకుండా వారికి ప్రాధాన్యం కలిగించడ లో పూర్తిగా విఫలం అయిందన్నారు. 

ఈ రోజు తాను కానీ, నాన్న దేవినేని రాజశేఖర్ నెహ్రు గారు కానీయండి .. ఇలా ఉన్నాం అంటే అది కేవలం మమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలు, అభిమానుల వల్ల మాత్రమేనని... అలాంటి కార్యకర్తలకు ప్రాధాన్యం లేని చోట  ఉంటూ  ఆత్మవంచన చేసుకోవద్దని నిర్ణయించుకున్నానని తెలిపారు. అలాగే పార్టీలో కమిట్మెంట్ తో పని చేసే వారికి ప్రాధాన్యం లేకపోవడం, భజన చేసే వారికి అధిష్టానం వత్తాసు పలకడం మనసును ఎంతో గాయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.

టిడిపిని వీడే ఉద్దేశం లేదని నేను ఎన్ని విధాలుగా చెప్పినా ఎప్పటికప్పుడు తన పార్టీ మారుతున్నానని వదంతులు పుట్టించి, అధిష్టాననానికి తన గురించి తప్పుడు సంకేతాలు వెళ్లేలా చేశారని... వాటిని గుర్తించకుండా పార్టీ పెద్దలు ఇంకా వారినే చేరదీస్తూ ఉండడంతో మనసు విరిగిపోయిందన్నారు. అందువల్లే పార్టీని వీడాలన్న కఠిన నిర్ణయం   తీసుకున్నట్లు పేర్కొన్నారు.

read more  టిడిపిని వీడకూడదనే అనుకున్నా... కానీ వారివల్లే...: దేవినేని అవినాశ్

పార్టీ అందించిన ప్రతి పనినీ బాధ్యతగా నిర్వర్తించినా ఇటీవల తన విషయంలో పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు కేవలం ఒక్కడినే కాదు కార్యకర్తలు, అనుచరులను కూడా అయోమయానికి గురిచేస్తున్నాయని తెలిపారు. మొన్న గుడివాడ ఇంచార్జి అని...ఇటీవల గన్నవరం అంటున్నారని రేపు ఇంకెక్కడో .. ఇలా ప్రతిసారీ తాను మారినా కార్యకర్తలు కూడా మారాలంటే ఎలా ? అని ప్రశ్నించారు. 

స్థానికంగా బలపడుతున్న ప్రతీసారీ ఇలాంటి ఒడిదుడుకులు వస్తుంటే ఎక్కడ కుదురుకోవాలి ? ఎలా పార్టీని బలపరచాలి ? అందుకే ..కార్యకర్తలతో సుదీర్ఘంగా చర్చించిన మీదట పార్టీ వీడాలని నిర్ణయించుకున్నానని అన్నారు. తనను ఇంతకాలం ఆదరించిన చంద్రబాబు కుకృతఙ్ఞతలు... ఆయన మీద గౌరవం ఎప్పటికీ అలాగే ఉంటుందని అవినాశ్ పేర్కోన్నారు.

వీడియో కోసం పక్కనున్న లింక్ పై క్లిక్ చేయండి  video news : ఎవరినీ అవహేళన చేసేలా మాట్లాడే వ్యక్తిని కాను