విజయవాడ: ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలతో నీటిపారుదల ప్రాజెక్టులన్ని నిండుకుండల్లా మారాయి. ప్రస్తుతం కూడా భారీ ఎత్తున ప్రాజెక్టుల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ఇలా కృష్ణా నదిపై నిర్మించిన పులిచింతల ప్రాజెక్టుకు కూడా వరద ఉధృతి సాగుతోంది. అయితే ఈ వరద నీటిలో ఎక్కడినుండో ఓ మొసలి ప్రాజెక్టులోకి చేరింది. అత్యంత ప్రమాదకర రీతిలో బుధవారం నీటిలోంచి బయటకు వచ్చిన మొసలి ప్రాజెక్టు సమీపంలోని ప్రజలకు భయబ్రాంతులకు గురిచేసింది. అతి కష్టం మీద మొసలిని నీటిలోకి పంపించారు స్థానికులు. ఈ మొసలి నుండి స్థానికులకు ఎలాంటి ప్రమాదం జరక్కుండా చర్యలు తీసుకోవాలని వారు అధికారులను కోరారు. 

వీడియో

"