మేమే అలా మాట్లాడం... మీ జాతిరత్నాలతో జాగ్రత్త..: జగన్ కు సిపిఐ కార్యదర్శి హెచ్చరిక

ఆంధ్ర ప్రదేశ్ లో బాధ్యయుతమైన పదవుల్లో వున్నవారే  నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని వైసిపి ప్రభుత్వం, మంత్రులపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఫైర్ అయ్యారు.   

cpi state secretary ramakrishna warns ys jagan

విజయవాడ:  భాద్యతాయుతమైన మంత్రి పదవిలో వున్న బొత్స సత్యనారాయణ రాజధాని అమరావతిని స్మశానంతో పోల్చడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ అన్నారు. గతంలో జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే రాజధానిని ప్రకటించడం,  శంకుస్థాపన చేయడం జరిగిందని... అప్పుడు ఎవ్వరూ నోరు మెదపకుండా ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని సూచించారు. 

విజవాడలోని దాసరి భవన్ లో రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. వైసిపి ప్రభుత్వం రాజధానిని శ్మశానంగా మార్చాలని చూస్తోందా..? అని ప్రశ్నించారు. మంత్రులు ఏం మాట్లాడుతున్నారో కూడా అర్ధం కావడం లేదన్నారు.  ఆలయం, చర్చీ వంటి ప్రార్థనా మందిరాల గురించి మాట్లాడేటప్పుడు వామపక్ష పార్టీలుగా తాము కూడా ఆచి తూచి మాట్లాడతామని... కానీ మంత్రులు మాత్రం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. 

''నీ అమ్మ మొగుడు కట్టించారా'' అని ఒక మంత్రి మాట్లాడితే మరో పక్క సాక్షాత్తు అసెంబ్లీ స్పీకర్ కూడా సంయమనం కోల్పోయి అసభ్యంగా మాట్లాడారని గుర్తుచేశారు.  తమ జాతి రత్నాలైన మంత్రులను  సీఎం జగన్ కట్టడి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 

read more  తెలుగు అవసరమే..కానీ తెలుగు మాధ్యమం కాదు...: ప్రొ. కంచ ఐలయ్య

25 ఎంపీలు ఇస్తే కేంద్ర ప్రభుత్వంతో పోరాడి రాష్ట్ర ప్రయోజనాలను నెరవేరుస్తామన్న వైసిపి నాయకులు ఏం చేస్తున్నారని నిలదీశారు. ఇప్పటికైనా విభజన హామీలను అమలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు. అలాగే బిజెపి నాయకులు కూడా ఇక్కడ కాకుండా రాష్ట్ర ప్రయోజనాలకై ఢిల్లీలో మాట్లాడితే మంచిదన్నారు. 

రాజ్యాంగ దినోత్సం నాడు 'మహా' తీర్పు ఇచ్చిన జస్టిస్ రమణ కు రామకృష్ణ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. దేశంలో ప్రధాని, గవర్నర్, వ్యవస్థలను అమిత్ షా భ్రష్టు పట్టించారని...రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన వ్యక్తులు అధికారం కోసం దిగజారి వ్యవహరించారని మండిపడ్డారు. రాజ్యాంగంపై గౌరవం ఉంటే మహారాష్ట్ర గవర్నర్ ను వెంటనే బర్తరఫ్ చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. 

read more  స్థానికులకే మొదటి ప్రాధాన్యత...అందుకోసమే ప్రత్యేక చట్టం: అవంతి

 బిజెపి మిగతా రాజకీయ పార్టీలకంటే డిఫరెంట్ అని ఆ పార్టీ నాయకులు చెప్పుకుంటారని... తాజాగా అర్ధరాత్రి ప్రమాణ స్వీకరాలతో అది నిజం అని నిరూపించుకున్నారని ఎద్దేవా చేశారు. నల్లధనం తెస్తామన్న వారే ఆర్ధిక నేరాలకు పాల్పడిన వారిని పార్టీలో చేర్చుకుని కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. డిసెంబర్ 10న బ్యాంక్ ఉద్యోగులు ఢిల్లీలో చేపట్టనున్న ధర్నాకు సీపీఐ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు రామకృష్ణ వెల్లడించారు. 


 

  

  
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios