పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావడంతో ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు అధికార పక్షానికి సూచనలు చేస్తున్నాయి. తాజాగా సిపిఐ నేత రామకృష్ణ విజయవాడ మీడియా సమావేశంలో మాట్లాడారు. రామకృష్ణ మాట్లాడుతూ.. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలలో అయిన రాష్ట్రానికి న్యాయం చేయాలని కోరుతున్నా. ఐదేళ్లు గడిచిపోయినా ఇంకా విభజన ఆంశాలు సమస్యలు ఇంతవరకు పరిష్కారం కాలేదు. 

చంద్రబాబు 5ఎళ్ళు అధికారంలో ఉన్నా ఏమీ చేయలేక పోయారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం అయినా మోడిపై ఒత్తిడి తీసుకురావాలి. వెనుకబడిన రాయలసీమ ప్రాంత అభివృద్ధి కి నిధులు, పోలవరం నిధులు పై కేంద్రం స్పందించాలి. ప్రత్యేక హోదాపై రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్ ప్రత్యేక దృష్టి పెట్టాలి. 

ప్రత్యేక హోదా సాధన కోసం జగన్ అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి నాయకులని మోడీ వద్దకు తీసుకుని వెళ్ళాలి అని రామకృష్ణ అన్నారు. ప్రజలకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు అవసరమైన భూమి లేదని 20 వేళా కోట్లతో కొనుగోలు చేస్తున్నారు. 

మరోవైపు బిల్డ్ ఏపీ పేరుతో ఉన్న భూములని విక్రయించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇది సరైన పద్దతి కాదని రామకృష్ణ అన్నారు. ఇక ఎమ్మెల్యేలు హుందాగా నడుచుకోవడం లేదని కూడా రామకృష్ణ విమర్శించారు. ఎమ్మెల్యేలు బూతులు మాట్లాడడం తగదు. ముఖ్యమంత్రి జ్యోక్యం చేసుకుని ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలి అని రామకృష్ణ అన్నారు.