విజయవాడ: అమిత్‌ షా లాంటి వాళ్ళే దేశానికి కావాలని జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ ప్రకటించడం రాజకీయ అవకాశవాదమని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) అభిప్రాయపడుతోందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు పేర్కొన్నారు. ఆయన తన వైఖరిని పునరాలోచించుకోవాలని సిపిఎం తరపున కోరుతున్నామని అన్నారు.

రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ, మైనారిటీలు, దళితులపై దాడులను ప్రోత్సహిస్తూ, హిందీ భాషను బలవంతంగా రుద్దాలని, రాష్ట్రాల ప్రయోజనాలను దెబ్బతీయాలని, ప్రాంతీయ పార్టీలను నాశనం చేయాలని, రాజకీయంగా తమకు వ్యతిరేకంగా వున్న సంస్థలను, వ్యక్తులను సి.బి.ఐ, ఇ.డి. లాంటి సంస్థలను ఉపయోగించి దారిలోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్న అమిత్‌షా లాంటి వ్యక్తులే దేశానికి సరైనవాళ్ళని ప్రకటించడం ప్రజలను మరింత నిరంకుశంగా అణగదొక్కడానికి ప్రోత్సహించడమే అవుతుందన్నారు.

read more చంద్రబాబు నమ్ముకుంటే ఎవరి సంక వారు నాక్కున్నట్టే: కొడాలి నాని

కేంద్ర ప్రభుత్వ నిరంకుశ చర్యలకు వ్యతిరేకంగా పోరాడాల్సిందిపోయి ఈ రకమైన ప్రకటనలు చేయడం సమంజసం కాదన్నారు.  కులానికి, మతానికతీతమంటూ ప్రకటించి ఒక మతతత్వ పార్టీ నేతలను కీర్తించడం సరైంది కాదని... బిజెపికి వ్యతిరేకంగా ఉద్యమిస్తానని చెప్పిన మాటకు కట్టుబడి తన వైఖరిని పునరాలోచించుకోవాలని సిపిఐ(యం) కోరుతోందని మధు అన్నారు. 

సీపీఐ నేత రామకృష్ణ కూడా పవన్ పై ఫైర్ అయ్యారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వని బీజేపీని ఎందుకు పొగుడుతున్నారు? అనిప్రశ్నించారు. ప్రాంతీయ పార్టీల నేతలు మోదీ, అమిత్ షాను చూసి భయపడుతున్నారన్నారు. 

ప్రాంతీయ పార్టీలు వెన్నెముక లేనివిగా వ్యవహరిస్తున్నాయని... బీజేపీకి వత్తాసు పలుకుతూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రామకృష్ణ తప్పుబట్టారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, ప్యాకేజీ ఇవ్వని బీజేపీని ఎందుకు పొగుడుతున్నారని ప్రశ్నించారు. ఆ పార్టీ అధ్యక్షులు అమిత్ షాను ఎందుకు పొగుడుతున్నారో పవన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 

read more  ఛాన్స్ కొట్టేశారు: వైసీపీలో భారీగా నామినేటెడ్ పదవులు

పవన్ ఢిల్లీ వెళ్లినప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ నేతలు మీకేమైనా చెప్పారా? అని నిలదీశారు. ప్రాంతీయ పార్టీల నేతలు మోదీ, అమిత్ షాను చూసి భయపడుతున్నారన్నారని రామకృష్ణ అన్నారు.