కృష్ణా జిల్లా:  అక్రమంగా మద్యాన్ని విక్రయించడమే కాదు...తనిఖీ కోసం వెళ్లిన పోలీసులపై బెల్టుషాప్ నిర్వహకులంతా ఏకమై దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన జిల్లాలోని పెడన మండలం పుల్లపాడు గ్రామంలో చోటుచేసుకుంది. 

ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అక్రమ మద్యం విక్రయాలపై ఉక్కుపాదం మోపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గ్రామాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా మద్యం విక్రయాలు జరుపుతున్న బెల్టుషాపులపై స్థానిక ఎక్సైజ్ శాఖ, పోలీస్ విభాగం దాడులు చేపడుతోంది. ఈ క్రమంలోనే పుల్లపాడు గ్రామంలో తనిఖీలు చేపట్టేందుకు స్థానిక ఎస్సైతో పాటు కొంతమంది కానిస్టేబుల్లు వెళ్లారు.

read more video: దారుణం... ఇసుక కొరతతో కార్మికుడి సెల్ఫీ సూసైడ్

గ్రామంలోని బెల్టుషాపుల్లో తనిఖీలు చేపడుతుండగా ఒక్కసారిగా యజమానులు వారిపై దాడికి పాల్పడ్డారు. దీంతో ఎస్సైతో పాటు ముగ్గురు కానిస్టేబుల్లు తీవ్రంగా గాయపడ్డారు. ఎలాగోలా ఈ దాడినుండి తప్పించుకున్న పోలీసులు గాయాలతో వెనుదిరిగారు. 

ఈ దాడికి పాల్పడిని నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా మద్యం విక్రయాలు చేపట్టడటమే కాకుండా  విధుల్లో వున్న పోలీసులపై దాడిచేసినందుకు వీరిపై కేసులు నమోదు చేశారు. వీరి చేతిలో గాయపడ్డ ముగ్గురు కానిస్టేబుల్లు చికిత్స పొందుతున్నారు. 

read more చంద్రబాబు లేఖకు వల్లభనేని వంశీ జవాబు ఇదీ..

ఎన్నికల మేనిఫెస్టో హామీల అమలులో భాగంగా జగన్ సర్కార్ మొదటి అడుగుగా సంపూర్ణ మధ్యనిషేధానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో ఇప్పటివరకున్న షాపుల్లో 20% రద్దు చేస్తూ మద్యం విక్రయాలను తగ్గిస్తూ ప్రభుత్వ ఆధీనంలోనే మద్యం షాపులను ప్రారంభించింది. ఇలా వైన్ షాపులను తగ్గించిన ప్రభుత్వం గ్రామాల్లో మద్యం విక్రయాలను చేపట్టే బెల్టు షాపులపై కూడా ఉక్కుపాదం పోపుతోంది. 

గ్రామాల నుండి అందుతున్న ఫిర్యాదులను స్వీకరిస్తున్న పోలీసులు వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. ఇలాగే పుల్లపాడు గ్రామంలో కొందరు బెల్టుషాపులు నిర్వహిస్తూ విచ్చలవిడిగా మద్యాన్ని విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో తనిఖీల కోసం వెళ్లిన సిబ్బంది దాడికి గురయ్యారు.