ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి మానత్వాన్ని చాటుకున్నారు. భవాని దీక్ష లో ఉన్న కళ్ళులేని వ్యక్తిని స్వయంగా దగ్గరుండి దర్శనం చేయించారు.

శ్రీకాకుళానికి చెందిన వెంకటరమణ అనే అంధుడు భవానీ మాలను ధరించి.. దీక్షను విరమించుకునేందుకు విజయవాడ వచ్చాడు. అయితే భక్తుల తాకిడి అధికంగా ఉండటంతో క్యూలైన్‌లోనే 5 గంటల పాటు ఇరుక్కుపోయాడు.

ఇతనిని  గమనించిన ఉపముఖ్యమంత్రి  తన ప్రోటోకాల్ ని కూడా పక్కనపెట్టి మానవతా దృక్పథం తో తనతో పాటు అమ్మవారి దర్శనానికి తీసుకొని వెళ్ళారు. దీనిని చూసిన మిగిలిన భక్తులు నారాయణ స్వామిని అభినందించారు.