విజయదశమి సందర్భంగా శ్రీరాజరాజేశ్వరీదేవి అవతారంలో ఉన్న కనక దుర్గమ్మని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ దర్శించుకున్నారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేసి అమ్మవారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు.

ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. దసరా పండుగనాడు అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. పోలీస్, రెవెన్యూ, ఆలయ అధికారుల సమన్వయంతో దసరా ఉత్సవాలు నిర్వఘ్నంగా జరిగాయన్నారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండేలా చూడాలని అమ్మవారిని కోరుకున్నట్లు సవాంగ్ పేర్కొన్నారు. రాష్ట్రపోలీసులకు మరింత శక్తిని ప్రసాదించాలని వేడుకున్నట్లు డీజీపీ తెలిపారు.