రాజధాని ఉద్యమం ఉదృతం... అమరావతి పరిరక్షణ సమితి జెఏసి ఏర్పాటు

ఆంధ్ర ప్రదేశ్ రాజధానిని అమరావతి నుండి తరలించవద్దంటూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు అమరావతి పరిరక్షణ జేఏసి ఏర్పడింది.  

ap  capital issue... amaravati parirakshana JAC formed

విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా కేవలం అమరావతే వుండాలని... వేరే ప్రాంతాలతో కలిసి రాజధానిని పంచుకోబోమని ఆ ప్రాంత ప్రజలు, రైతులు నిరసన జరుపుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ నిరసనలను ఉద్యమరూపంగా మలిచి ముందుకు తీసుకెళ్లేందుకు కొన్ని ప్రజాసంఘాలు కలిసి అమరావతి పరిరక్షణ సమితి జెఏసి(జాయింట్ యాక్షన్ కమిటీ)గా ఏర్పడ్డాయి. 

విజయవాడలో క్రెడాయ్ రాష్ట్ర అధ్యక్షుడు శివారెడ్డి ఆదర్యంలో వివిధ సంఘాలు సమావేశమయ్యాయి. రాజధాని మార్పు, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై జెఏసి నేతలు ఆగ్రహం  వ్యక్తం చేశారు. రాష్ట్ర పురోగతికి కారణం అయ్యే సంఘాలన్నింటికి కలుపుకుని జెఏసి గా ఏర్పడినట్లు తెలిపారు. 

జియన్ రావ్ కమిటి నివేదిక అందకముందే ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటన చేశారని గుర్తుచేశారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఐదేళ్ళుగా తప్పుగా అనిపించలేదు కానీ అధికారంలోకి రాగానే తప్పుగా కనిపించిందా... ఇది మంచి పద్దతి కాదన్నారు. 

read more  ఆయన వల్లే జగన్ కు ఇంతటి పరిణతి... పుట్టినరోజు వేడుకల్లో ఉమ్మారెడ్డి ప్రశంసలు

అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరగాల్సిందేనని... కానీ ఒక  ప్రాంతం కోసం మరో ప్రాంతాన్ని బలిచేయవద్దన్నారు. ‌విధాన పరమైన నిర్ణయాలు తప్పుగా ఉంటే సరి చేసుకోవాలిగానీ ఇలా రాజధానినే మారుస్తామంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని కృష్ణా గుంటూరు జిల్లా వాసులు ఎవరు స్వాగతించరన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఈ జిల్లావాసులతో కలిసి తామంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. 

ఆంద్రప్రదేశ్ భౌగోళికంగా చాల దూరం విస్తరించి ఉందని... కర్నూలు, శ్రీకాకుళం మధ్య రాకపోకలు సాగించాలంటే కష్టసాద్యమన్నారు. పరిపాలన సౌలభ్యం అంటే ఉధ్యోగులను, అధికారులను ఇబ్బంది పెట్టడమేనా... అప్పుడు హైదరాబాదు నుండి విజయవాడకు, ఇప్పుడు విజయవాడ నుండి వైజాగ్ కు అని తరలించడమేనా అని ప్రశ్నించారు.

ప్రస్తుతం రాజధానిపై తీసుకున్న నిర్ణయం అన్ని వర్గాల ప్రజలను అయోమయంలోకి నెట్టారన్నారు. ప్రభుత్వం తమ ఆలోచనపై పునరాలోచన చేయాలన్నారు. ప్రస్తుతం రాజధాని ప్రాంత ప్రజలు, రైతుల పరిస్థితి జీవన మరణ సమస్యగా తయారైందన్నారు. ప్రజలంతా ఆందోళనలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

read more  హైకోర్టుతో కర్నూలుకు ఒరిగేదేం లేదు... బిజెపి విధానమిదే: విష్ణువర్ధన్ రెడ్డి

ఈ ప్రాంతం ప్రజా ప్రతినిధులు ప్రజా ద్రోహులుగా మారవద్దని జేఏసి నాయకులు తిరుపతిరావు హెచ్చరించారు. కేవలం తమ రాజకీయాల కోసం నమ్ముకున్న ప్రజల జీవితాలను బలి చేయవద్దన్నారు. అందరూ పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా మాట్లాడాలన్నారు.

రాష్ట్రానికి రాజధాని లేదని ఇక్కడి రైతులు 33వేల ఎకరాలు భూములు ఇస్తే వారిన హేళనగా చూస్తారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ కాళ్ళకు నమస్కరించి చెబుతున్నాం  రాజధానికి మార్చవద్దని అంటూ ఆవేదనను వెల్లగక్కారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీలకు తోత్తులుగా మారవద్దని అన్నారు. ఈ మూడు రాజధానుల అంశంపై త్వరలో కార్యచరణ రూపోందించి ప్రజా పోరాటం వైపు నడుస్తామని జేఏసి నాయకులు వెల్లడించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios