Asianet News TeluguAsianet News Telugu

నా పుట్టినరోజును ఎలా సెలబ్రేట్ చేయాలంటే...: కొడాలి నాని

 మంగళవారం తన పుట్టినరోజు వేడుకలను వినూత్నంగా జరుపుకునేందుకు మంత్రి కొొడాలి నాని సిద్దమయ్యారు. ఈ మేరకు ఆయన తన అభిమానులు, వైసిపి  కార్యకర్తలు, అనుచరులకు ఓ సూచన చేశారు.  

andhra pradesh minister kodali nani comments on his birthday
Author
Vijayawada, First Published Oct 21, 2019, 2:38 PM IST

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి ఈసారి తన పుట్టినరోజును డిఫరెంట్ గా జరుపుకోడానికి మంత్రి కొడాలి నాని (వెంకటేశ్వర రావు) సిద్దమయ్యారు. ఈ నెల 22వ తేదీన జరగనున్న మంత్రి పుట్టినరోజున సందర్భంగా అనుచరులు.అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఎలాంటి గిప్ట్ లు ఇవ్వాలో, ఎలా శుభాకాంక్షలు తెలియజేయాలో వివరిస్తూ పౌరసరఫరాల శాఖ మరియు వినియోగదారుల శాఖ ఓ ప్రకటనను విడుదలచేసింది. 

''ఈ నెల 22 తేదీన నా పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలపాలని వచ్చే ప్రజలకు ,అభిమానులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులకు ఓ విజ్ఞప్తి.  నా జన్మదిన వేడుకలు కంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడమే మన అందరి కర్తవ్యంగా భావిస్తున్నాను. 

బోటు మునిగి నెలన్నర .. రాష్ట్రం మునిగి నాలుగు నెలలు: దేవినేని ఉమా...

ఈ రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి పేదవాడు చదువు కోవాలనే ముఖ్యమంత్రి ఆకాంక్షలో మనం సైతం పాలుపంచుకుందాం. ఇందుకోసం నాకు జన్మదిన  శుభాకాంక్షలు తెలపాలని అనుకునేవారు పూలదండలు, పుష్పగుచ్చాలు, స్వీట్లు, కేకులతో నా దగ్గరకు వస్తారు. ఇది కేవలం ఆ  ఒక్కరోజు మాత్రమే నాకు ఆనందాన్ని కలిగిస్తాయి.

.కానీ వాటికి బదులుగా  పుస్తకాలు, పెన్నులు, రైటింగ్ ప్యాడ్ లు తీసుకుని వస్తే వాటిని చదువుకునే ప్రతి పేద విద్యార్థికి  అందించవచ్చు. ప్రతి పేదవాడు ఉన్నత చదువులు చదువుకుంటే  పేద కుటుంబాల  జీవితాల్లో అనందాలు వెల్లువిరుస్తాయన్నారు. అది జీవితాంతం నాకు ఆనందాన్నిస్తుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంకల్పం మనందరికి నిజమైన ఆనందాన్ని అందిస్తుంది.'' అని నాని పేర్కొన్నారు. 

ఈనెల 22వ తేదీన మంత్రి హోదాలో కొడాలి నాని మొదటి పుట్టిన రోజు  జరుపుకోనున్నారు.  ఈ నేపథ్యంలో అభిమానులు ,వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇప్పటికే భారీ ఏర్పాటు చేసుకున్నారు. ఈ తరుణంలో మంత్రి  ప్రకటన అభిమానులు నిరాశ పరిచిన ఒక ఉన్నతమైన ఆశయంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అడుగుజాడల్లో తమ నాయకుడు నడవటం పట్ల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడిని చదివించాలన్న ముఖ్యమంత్రి ఆశయాని మంత్రి ఫాలో అవ్వడం ఆనందంగా వుందంటున్నాను ఆయన అనుచరులు.  ఆయన పిలుపు మేరకు రేపు(మంగళవారం) అందరం పెన్నులు, రోట్ పుస్తకాలతో విషెస్ చెబుతామని అంటున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios