అమరావతి: నవంబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని మూడురోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రేపు(శుక్రవారం) నిర్వహిస్తున్న రాష్ట్ర అవతరణ వేడుకలకు రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు, పురప్రముఖులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. 

ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిభింబించేలా ప్రత్యేక కార్యక్రమాలను మూడు రోజుల పాటు విజయవాడ ఇందిరాగాంధి మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించున్నారు. దీనితోపాటు స్వాతంత్ర పోరాటంలో త్యాగాలు చేసిన మహనీయుల కుటుంబ సభ్యులు, బంధువులను ఘనంగా సన్మానించనున్నారు. 

read more విశాఖ భూకుంభకోణంపై చంద్రబాబు సిట్...అందులో ఏముందంటే...: విజయసాయి రెడ్డి

రాష్ట్రానికి చెందిన స్వర్గీయ పింగళి వెంకయ్య, పొట్టి శ్రీరాములు,  టంగుటూరి ప్రకాశం పంతులు, అల్లూరి సీతారామరాజు, కన్నెగంటి హనుమంతు, కోటిరెడ్డి, వావిలాల గోపాలకృష్ణయ్య, ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి, దామోదరం సంజీవయ్యల వారసులు, బంధువులను రాష్ట్ర అవరతణ సందర్బంగా ప్రభుత్వం ఘనంగా సన్మానించనుంది.

ఈ సందర్బంగా వేదికకు ఇరువైపులా చేనేత, హస్తకళల ప్రదర్శన స్టాల్స్ తో సర్వంగ సుందరంగా తీర్చిదిద్దనున్నారు. సంగీతం, నృత్యం, నాటకం వంటి లలితకళా ప్రదర్శనలతో మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.  ఈ సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల ఆహారపు అలవాట్లు, ప్రసిద్ది చెందిన వంటకాలను ప్రజలకు అందించేందుకు 25 ఫుడ్ స్టాల్స్ ను ఏర్పాటు చేస్తున్నారు.

read more అది ప్రజల హక్కు దాని పై మీ బోడిపెత్తనం ఏంటి: జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు మండిపాటు

అమరజీవి పొట్టిశ్రీరాములు త్యాగ ఫలం ఆంధ్రప్రదేశ్

ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం, ఆనాటి ఉమ్మడి మద్రాస్‌ రాష్ట్రంలో ఆంధ్రులు ఎదుర్కొంటున్న వివక్షతకు వ్యతిరేకంగా  ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ రాజీలేని పోరాటం చేసిన మహనీయుడు స్వర్గీయ పొట్టి శ్రీరాములు. ''కొందరు సాధారణంగా జీవిస్తారు. మరికొందరు లక్ష్యం కోసం జీవిస్తారు. కొందరు మాత్రమే ఆ లక్ష్యాన్ని సాధించడానికి ప్రాణాలను కూడా లెక్కచేయరు." ఇటువంటి కోవలోకే స్వర్గీయ పొట్టిశ్రీరాములు కూడా వస్తారు.

దేశంలో నిరాహారదీక్ష ద్వారా తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించే క్రమంలో జతిన్ దాస్‌ తరువాత ప్రాణత్యాగం చేసిన రెండో వ్యక్తి అమరజీవి పొట్టిశ్రీరాములు. ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం కోసం యాబై ఎనిమిది రోజుల పాటు నిరాహారదీక్ష చేసి, తన ప్రాణాలను బలి ఇవ్వడం ద్వారా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కారణమయ్యారు. అందుకే అర్ధ శతాబ్దం కు పైగా ఇంకా ఆంధ్రుల గుండెల్లో పొట్టి శ్రీరాములు అమరజీవిగా నిలిచిపోయారు.