Asianet News TeluguAsianet News Telugu

ఖాతాదారుల్లో ఆనందాన్ని నింపిన బ్యాంకర్ల సేవా మహోత్స‌వం

ఖాతాదారులు తీసుకున్న రుణాలతో తమ ఆర్థిక అవసరాలను తీర్చుకుని అభివృద్ధి చేందాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో మొదటి విడత లో సేవా మహోత్సవం నిర్వహించటానికి కృష్ణా, చిత్తూరు జిల్లాలు ఎంపికయ్యాయని తెలిపారు. మొదటి విడతలో బ్యాంకర్లు రూ.100 కోట్ల వరకు రుణాలు ఇస్తే బాగుంటుందని అనుకున్నామని చెప్పారు.

andhra bank arranged special program for users
Author
Hyderabad, First Published Oct 8, 2019, 8:27 AM IST

కృష్ణా జిల్లాలో వారం రోజుల వ్యవధిలో ఖాతాదారుల ఆర్థిక అవసరాల కోసం రూ.740 కోట్లు రుణాలు అందించటం ఒక రికార్డు అని జిల్లా కలెక్టర్ ఎయండి ఇంతియాజ్ అన్నారు. సోమవారం నగరంలోని ఐవీ ప్యాలెస్‌లో ఆంద్రా ఖాతాదారుల సేవా మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎ.యండి. ఇంతియాజ్ మాట్లాడుతూ బ్యాంకు ఖాతాదారులకు తామున్నామని వారి చెంతకే వచ్చి వారి చింతన తీర్చేలా ఖాతాదారుల సేవా మహోత్సవం నిర్వహించటం అభినందనీయమన్నారు. 

ఖాతాదారులు తీసుకున్న రుణాలతో తమ ఆర్థిక అవసరాలను తీర్చుకుని అభివృద్ధి చేందాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో మొదటి విడత లో సేవా మహోత్సవం నిర్వహించటానికి కృష్ణా, చిత్తూరు జిల్లాలు ఎంపికయ్యాయని తెలిపారు. మొదటి విడతలో బ్యాంకర్లు రూ.100 కోట్ల వరకు రుణాలు ఇస్తే బాగుంటుందని అనుకున్నామని చెప్పారు.

 కాని మచిలీపట్నంలో ఈ నెల 3, 4 తేదీల్లో ఇండియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఖాతాదారుల సేవా మహోత్సవం కార్యక్రమంలో మొత్తం రూ. 243 కోట్లు రుణాలు ఇచ్చి ఒక రికార్డును నెలకొల్పారని  తెలిపారు. అదే స్ఫూర్తితో రెట్టింపు ఉత్సాహంతో ఈ నెల ఏడవ తేదీ నుండి మూడు రోజుల పాటు నిర్వహించే ఖాతాదారుల సేవా మహోత్సవంలో 24 వివిధ బ్యాంకుల ద్వారా 500 కోట్లు అందించటం అభినందనీయమన్నారు. 

ఇది రాష్ట్రంలో ఒక రికార్డుగా నిలుస్తుందన్నారు. పండుగ సీజన్ లో ఖాతాదారుల ఆర్థిక అవసరాలకు మేమున్నామని బ్యాంకర్లు ముందుకు వచ్చి పెద్ద ఎత్తున రుణాలు మంజూరు చేయడం వారికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రకృతి ఎంతో సహకరిస్తున్నా వేళలో రైతులకు పంట రుణాలు అందించటంలో బ్యాంకర్లు మరింత ముందుకు రావాలన్నారు. 

గృహ, వాహన, వ్యక్తిగత విద్యా తదితర రుణాలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు కార్పొరేషన్ ల ద్వారా బ్యాంకర్లు రుణాలు అందిస్తున్నాయని వాటితో వారి ఆర్థిక, కుటుంబ పరిస్థితులను మెరుగుపరచుకోవాలన్నారు. అక్టోబర్ నెలాఖరు వరకు రుణాలు ఇవ్వడం జరుగుతుందని అర్హులైన వారు ధరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రభుత్వం మేమున్నామనే భరోసా కల్పించటానికే ఖాతాదారుల సేవా మహోత్సవము నిర్వహంచటం జరుగుతుందన్నారు. 

ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొడదాం. ఇంటిని, సమాజాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యతని ఇందుకు సింగ్ల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని నిలుపుదల చేద్దామన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని ఎంతవీలైతే అంత తగ్గించి భావితరాలకు మంచి సమాజాన్ని అందిద్దామని ఖాతాదారులకు పిలుపునిచ్చారు. అందరి సమిష్టి కృషి సహకారంతోనే ప్లాస్టిక్ నిరోదిద్దామన్నారు. 
                                      
 విజయవాడ మున్సిపల్ కమీషనర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ ఒకప్పుడు ఖాతాదారులు రుణాలు కోసం బ్యాంకుల చుట్టూ తిరిగేవారని ఇప్పుడు బ్యాంకులే రూ. 700 కోట్ల రుణాలు ఇవ్వడానికి మన వద్దకు రావడం చాలా సంతోషదాయకమన్నారు. ఎస్ఎల్‌బీసీ కన్వీనర్ మరియు ఆంధ్రా బ్యాంకు అమరావతి జనరల్ మేనేజర్ కే.వి.నాంచారయ్య మాట్లాడుతూ దేశం మొత్తం మీద 400 జిల్లాల్లో ఖాతాదారుల సేవా మహోత్సవం జరుపుతున్నారన్నారు. 

మొదటి విడతలో అక్టోబర్ 3 నుంచి 7 వరకు 250 జిల్లాల్లో వివిధ బ్యాంకుల ద్వారా రుణాలకు సేవా మహోత్సవములు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఖాతాదారుల ఆర్థిక అవసరాలు తీర్చేందుకు భారత ప్రభుత్వ నిర్దేశానుసారం బ్యాంకులన్నీ ఒక ఫ్లాట్ ఫామ్ మీదకు రావడం జరిగిందన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం లో అక్టోబర్ 3 వ తారీఖున ఖాతాదారుల సేవా మహోత్సవము నిర్వహించగా ఈ రోజు విజయవాడలో నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో గృహ, విద్య, పరిశ్రమలు నెలకొల్పడం, ముద్రా, వ్యక్తిగత రుణాలు, స్వయం సహాయక సంఘాలకు మరియు ఇతర రుణాలను రూ.500 కోట్ల వరకు మంజూరు చేయడం జరగుతుందన్నారు. ఒక్క ఆంధ్రా బ్యాంకు రూ. 150 కోట్ల రుణాలు ఇవ్వనుందన్నారు. 

ఖాతాదారుల ఆర్థిక అవసరాలు తీర్చేందుకు సేవా మహోత్సవం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఆంధ్రాబ్యాంక్ ఆధ్వర్యంలో 620 స్వయం సహాయక గ్రూపులకు రూ. 24.54 కోట్ల రుణాలను, 385 మంది ఖాతాదారులకు ముద్రా రుణాలు కింది రూ.3.50 కోట్లు కలెక్టర్ ఏయండి. ఇంతియాజ్ అందజేశారు. వీటితోపాటు వివిధ బ్యాంకులు మంజూరు చేసిన రుణాల చెక్కులను ఖాతాదారులకు అందించారు. 

ఖాతాదారుల సేవా మహోత్సవము కార్యక్రమంలో ఆంధ్రా బ్యాంక్ డీజీఎం ఎం.వెంకటేశ్వరస్వామి, ఏ.జీఎం పి.నరసింహమూర్తి, ఎల్డీఎం రాంమోహన్‌రావు, ఇండియన్ బ్యాంక్ డీజీఎం వై.మణిమాల, ఎస్‌బీఐ డీజీఎం డి.నాగేంద్ర, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఏజీఎం అనిల్‌కుమార్, తదితర కేంద్ర రంగ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios