ఎయిరిండియా విమానానికి తృటిలో పెనుముప్పు తప్పింది. ఢిల్లీ నుంచి విజయవాడ వెళ్తున్న ఎయిరిండియా విమానానికి టేకాఫ్ సమయంలో ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం బెంబేలెత్తించింది.

పిడుగుల ప్రభావానికి విమానం కుదుపులకు లోనుకావడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. దీంతో పాటు విమానంలోని వస్తువులు, ఆహార పదార్థాలు చెల్లాచెదురయ్యాయి.