కృష్ణా జిల్లా కలెక్టరేట్ లో ఏసిబి దాడులు... రెండోసారి పట్టుబడిని మహిళా అధికారిణి
కృష్ణా జిల్లా కలెక్టరేట్ లో ఏసిబి దాడులు జరిగాయి. ఫిర్యాదుదారుడి నుండి లంచం తీసుకుంటూ ఓ మహిళా ఉన్నతాధికారిణి రెడ్ హ్యండెడ్ గా పట్టుబడ్డారు.
విజయవాడ: కృష్ణా జిల్లా కలెక్టరేట్ లో పనిచేస్తున్న ఓ మహిళా అధికారిణి ఏసిబికి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది. అయితే గతంలోనే ఆమె ఏసిబి చిక్కగా మళ్లీ ఎలాగోలా విధుల్లో చేరగలిగింది. కానీ తన వ్యవహారశైలిని మాత్రం మార్చుకోకుండా ప్రజల నుండి లంచాలను స్వీకరిస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది.
కృష్ణా జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి సెంటర్ లో నివాసముంటున్న మేకా రామలింగేశ్వర రెడ్డికి ఉయ్యూరు మండలం కాటూరులో వ్యవసాయ భూమి వుంది. అయితే ఆ భూమి వివాదంలో వుండటంతో దాన్ని పరిష్కరించుకునేందుకు జిల్లా భూసంస్కరణల అధికృత అధికారిణి(ఏఓ)గా పనిచేస్తున్న ప్రశాంతిని కలిశారు. అయితే ఈ సమస్యను పరిష్కరించేందుకు రూ.3లక్షల లంచం డిమాండ్ చేశారు.
read more జగన్ సర్కార్ సంచలన నిర్ణయం... ఎసిబి చీఫ్ విశ్వజిత్ పై బదిలీ వేటు
దీంతో అతడు సదరు అధికారిణిపై ఏసిబికి ఫిర్యాదు చేశాడు. దీంతో అడిషనల్ ఎస్పి ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో ఏసిబి అధికారులు వలపన్ని ఫిర్యాదుదారుడి నుండి లంచం తీసుకుంటుండగా అధికారిణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ వ్యవహారం జిల్లా కలెక్టరేట్ లోనే చోటుచేసుకోవడంతో సంచలనంగా మారింది.సాక్షాత్తు కలెక్టర్ కార్యాలయంలోనే అవినీతి అధికారిణి ఏసిబికి పట్టుబడటంతో మిగతా అధికారులు బెంబేలెత్తిపోతున్నారు.
ఈ భూమి తాలూకా ఇప్పటికే రూ.5 లక్షల రూపాయలు చెల్లించినట్లు రామలింగ రెడ్డి చెబుతున్నారు. అయినప్పటికి తన సమస్యను పరిష్కరించకుండా మరో రూ.3లక్షలు డిమాండ్ చేయడంతో దిక్కుతోచక ఏసిబిని ఆశ్రయించినట్లు తెలిపాడు.