Asianet News TeluguAsianet News Telugu

వరి వేస్తే ఉరేనన్న సన్నాసి సీఎం కేసీఆర్..: వైఎస్ షర్మిల ఫైర్

భూపాలపల్లి : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

భూపాలపల్లి : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వరి వేసుకుంటే ఉరే అన్న సన్నాసి ముఖ్యమంత్రి ఎవరైనా వుంటారా? అంటూ మండిపడ్డారు. మిర్చీ పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు చేతికందిన పంటను తగలబెట్టినా దిక్కులేదు... ఎవరికయ్యింది బంగారు తెలంగాణ? అని ప్రశ్నించారు. డిగ్రీలు, పీజీలు చదివి ఉద్యోగాలు రాకుండా ఇబ్బందిపడుతుంటే ఏ ఒక్కరినైనా ఆదుకున్నాడా కేసీఆర్ అని అడిగారు. మూడేళ్ళు కర్రసాము నేర్చి మూలనున్న ముసలిదాన్ని కొట్టినట్లుగా వుంది కేసీఆర్ తీరు... ఎనిమిదేళ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్ వేయకుండా ఇప్పుడు కేవలం 20 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తానంటున్నాడంటూ ఎద్దేవా చేసారు. ఐదు, ఆరు తరగతులు కూడా చదవనివారిని మంత్రిపదవులు... డిగ్రీలు, పీజిలు చదివిని బిడ్డలు హమాలీ, ఆటోలు నడుపుకుంటున్నారని షర్మిల అన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో భార్యాభర్తలిద్దరమే వుంటామని... మాకు శేరు బియ్యం సరిపోతాయన్న కేసీఆర్ ఇప్పుడు పెద్దపెద్ద గడీలు, ఫామ్ హౌస్ లు కట్టుకున్నాడని షర్మిల అన్నారు. స్కూటర్ పై తిరిగే కేసీఆర్ ప్రజల సొమ్ముతో విమానం కొనే స్థాయికి ఎదిగాడన్నారు. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ లోనే కేసీఆర్ కుటుంబం రూ.70వేల కోట్లు దోచుకుందన్నారు. స్వార్థ రాజకీయల కోసం కాంగ్రెస్, బీజేపీ ఏనాడూ కేసీఆర్ ను ప్రశ్నించలేవని... వైఎస్సార్ తెలంగాణ పార్టీ మాత్రము ఢిల్లీ దాకా వెళ్ కేసీఆర్ అవినీతిపై పోరాడుతోందన్నారు వైఎస్ షర్మిల. 

Video Top Stories