మునుగోడు వీధుల్లో ప్రస్తుతం కుక్కల కొట్లాట...: ఉపఎన్నికపై షర్మిల సంచలనం
నిజామాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ డిల్లీ పర్యటన, మునుగోడు ఉపఎన్నికపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేసారు.
నిజామాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ డిల్లీ పర్యటన, మునుగోడు ఉపఎన్నికపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేసారు. డిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎక్కడ కూతురు అరెస్ట్ అవుతుందోనని భయపడే లాబీయింగ్ చేయడానికి కేసీఆర్ డిల్లీకి వెళ్లారని షర్మిల ఆరోపించారు. అందుకోసమే కూతురును వెంటబెట్టకుని మరీ డిల్లీకి వెళ్లారన్నారు.
ఇక మునుగోడు ఉపఎన్నికలో మంత్రులు, ఎమ్మెల్యేలకు గ్రామాలు అప్పగించిన కేసీఆర్ ప్రజలకు మందు తాగించడానికి పంపారని షర్మిల అన్నారు. ఇప్పుడు ముననుగోడులో అదే పండగ అన్నారు. మునుగోడు ఉపఎన్నిక వీధుల్లో కుక్కుల కోట్లాటలా వుందంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. తన ఇలాకాలోనే విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో ఇద్దరు రైతులు చనిపోతే వారి కుటుంబాలను పరామర్శించేందుకు కూడా తీరికలేని ఆ శాఖ మంత్రి ఇప్పుడు మునుగోడుకు వెళ్లారని మండిపడ్డారు. 118 నియోజకవర్గాలకు గాలికొదిలేసి కేసీఆర్ డిల్లీకి, మంత్రులు, ఎమ్మెల్యేలు మునుగోడుకు వెళ్లారని షర్మిల అన్నారు.