ఓవైపు పాదయాత్ర మరోవైపు నిరుద్యోగ దీక్ష... ఆలేరు నియోజవర్గంలో వైఎస్ షర్మిల సందడి
భువనగిరి: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల మహాప్రస్థాన పాదయాత్ర యాదాద్రి భువనగిరి జిల్లాలో కొనసాగుతోంది.
భువనగిరి: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల మహాప్రస్థాన పాదయాత్ర యాదాద్రి భువనగిరి జిల్లాలో కొనసాగుతోంది. ఆలేరు నియోజకవర్గం మూటకొండూరు మండలం ఆరెగూడెం, గిరిబోయిన గూడెం గ్రామంలో పాదయాత్ర కొనసాగింది. ఇలా ఆయా గ్రామాల్లో వృద్దులు, మహిళలు, రైతులతో మాట్లాడుతూ సమస్యలు తెలుసుకున్న షర్మిల మూటకొండూరు మండలకేందానికి చేరుకున్నారు. అక్కడ వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు.