తుంగతుర్తి నియోజకవర్గంలో కొనసాగుతున్న వైఎస్ షర్మిల పాదయాత్ర...

నల్గొండ: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకునేందుకు ప్రజాప్రస్థానం పేరిట పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా తగ్గుముఖం పట్టడంతో ఇటీవల ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆమె పాదయాత్ర తిరిగి ప్రారంభమయ్యింది. ఇవాళ(గురువారం) షర్మిల పాదయాత్ర తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోనే సాగుతోంది. ప్రస్తుతం పార్టీ నాయకులు, కార్యకర్తలు వెంటరాగా షర్మిల కొత్తపల్లి గ్రామం వైపు పాదయాత్రగా వెళుతున్నారు. 
 
First Published Mar 31, 2022, 11:55 AM IST | Last Updated Mar 31, 2022, 11:55 AM IST