తెలంగాణలో రాష్ట్రపతి పాలన ... గవర్నర్ ను కోరతాం : వైఎస్ షర్మిల

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంతో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని...

First Published Feb 23, 2023, 12:54 PM IST | Last Updated Feb 23, 2023, 12:54 PM IST

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంతో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని... బిఆర్ఎస్ నాయకుల అరాచకాలు మరీ మితిమీరుతున్నాయని వైఎస్సార్ టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆందోళన వ్యక్తం చేసారు. తిరిగి రాష్ట్రంలో లా ఆండ్ ఆర్డర్ కంట్రోల్ లోకి రావాలంటే ప్రెసిడెంట్ రూల్ (రాష్ట్రపతి పాలన) ఒక్కటే మార్గమని అన్నారు. కాబట్టి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలిసి రాష్ట్రపతి పాలన విధించాలని వైఎస్సార్ టిపి నాయకత్వం కోరనుందని షర్మిల పేర్కొన్నారు. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ అపోలో హాస్పిటల్ లో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న కాంగ్రెస్ పార్టీ యూత్ లీడర్ తోట పవన్ ను షర్మిల పరామర్శించారు. ఈ సందర్భంగా... పవన్ పై వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ దాడి చేయించాడని ఆరోపించారు. ఇంత దారుణంగా కొడతారా...? అసలు బిఆర్ఎస్ పార్టీ నాయకులు మనుషులేనా? ప్రజల తరఫున ప్రశ్నిస్తే పాలకపక్షం ఇచ్చే బహుమతి ఇదేనా?  ఇలాంటి రౌడీలు, గూండాలతో కేసీఆర్  దేశాన్ని ఏలుతారా? అంటూ షర్మిల మండిపడ్డారు.