ఆ మంత్రులు, బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై... మహిళా కమీషన్ కు షర్మిల ఫిర్యాదు
హైదరాబాద్ : వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల అధికార బిఆర్ఎస్ నాయకులపై రాష్ట్ర మహిళా కమీషన్ కు ఫిర్యాదు చేసారు.
హైదరాబాద్ : వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల అధికార బిఆర్ఎస్ నాయకులపై రాష్ట్ర మహిళా కమీషన్ కు ఫిర్యాదు చేసారు. కొందరు మహిళా నాయకులతో కలిసి మహిళా కమీషన్ కార్యాలయానికి వెళ్లిన షర్మిల అధికారులకు లిఖితపూర్వక ఫిర్యాదు అందించారు. తనపై అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలతో దూషణలు చేసినవారి పేర్లను మహిళా కమీషన్ కు అందించానని... మహిళనైన తన గౌరవానికి భంగం కలిగించి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు షర్మిల తెలిపారు.
అధికారంలో ఉన్నవాళ్ల భార్యలు, బిడ్డలు ఏం చేసినా చెల్లుతుందా... స్వయంగా సీఎం కేసీఆర్ బిడ్డ లిక్కర్ స్కాం లో వుంది... ఎమ్మెల్యే శంకర్ నాయక్ భార్య భూకబ్జాలకు పాల్పడింది అని షర్మిల ఆరోపించారు. అధికారంలో వున్నారు కాబట్టి మీ ఇంటి మహిళలు ఏమయినా చేయొచ్చా... మీకొక న్యాయమా...? మాకు ఒక న్యాయమా..? అని నిలదీసారు. వెంటనే తనను దూషించిన నాయకులపై చర్యలు తీసుకోవాలి... ఇక్కడ న్యాయం జరగకపోతే జాతీయ మహిళా కమిషన్ ను ఆశ్రయిస్తానని షర్మిల హెచ్చరించారు.