సీఎం కేసీఆర్ ది లక్షల కోట్ల అవినీతి... సిబిఐకి ఫిర్యాదుచేసిన షర్మిల
న్యూడిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారాన్ని అడ్డంపెట్టుకుని భారీ అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని వైఎస్సార్ టిపి అధినేత్రి షర్మిల ఆరోపిస్తున్నారు.
న్యూడిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారాన్ని అడ్డంపెట్టుకుని భారీ అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని వైఎస్సార్ టిపి అధినేత్రి షర్మిల ఆరోపిస్తున్నారు. కేవలం ఆరోపణలతో సరిపెట్టుకోకుండా ఈ అవినీతి వ్యవహారంపై విచారణ జరపాలంటూ సిబిఐ కి ఫిర్యాదు చేసారు. ప్రస్తతం దేశ రాజధానిలో వున్న షర్మిల తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల విషయంలో జరిగిన అవినీతిపై విచారణ జరపాల్సిందిగా సిబిఐని కోరారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ఒక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ లోనే లక్ష కోట్ల అవినీతి జరిగిందని షర్మిల ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులు అవినీతికి పాల్పడ్డారని అన్నారు. ఇలా ప్రాజెక్టుల పేరిట జరిగిన దోపిడీపై విచారణ జరిపి నిజానిజాలను తేల్చాలంటూ షర్మిల సిబిఐకి వినతిపత్రం ఇచ్చారు.