కేసీఆర్... నీకు జై తెలంగాణ అనే దమ్ముందా..: షర్మిల ఛాలె

పాలకుర్తి : తెలంగాణ ప్రజలకు సేవ చేయడానికి తనకు బరాబర్ హక్కు వుందని వైఎస్సార్ టిపి అధినేత్రి వైఎస్ షర్మిల అన్నారు. ప్రస్తుతం తెలంగాణ పేరుతో వున్న ఏకైక రాజకీయ పార్టీ వైఎస్సార్ టిపి... 

First Published Feb 17, 2023, 2:28 PM IST | Last Updated Feb 17, 2023, 2:28 PM IST

పాలకుర్తి : తెలంగాణ ప్రజలకు సేవ చేయడానికి తనకు బరాబర్ హక్కు వుందని వైఎస్సార్ టిపి అధినేత్రి వైఎస్ షర్మిల అన్నారు. ప్రస్తుతం తెలంగాణ పేరుతో వున్న ఏకైక రాజకీయ పార్టీ వైఎస్సార్ టిపి... అలాంటి పార్టీని పట్టుకుని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఆంధ్రా పార్టీ అంటున్నారని అన్నారు. తెలంగాణ గడ్డపైనే పుట్టిపెరిగి, ఇక్కడి నీళ్లు తాగి, గాలే పీల్చిన నేను పెట్టింది ఆంధ్రా పార్టా... మరి పార్టీ పేరులోంచి తెలంగాణ పదాన్నే తీసేసిన కేసీఆర్ ను ఏమంటావు అని నిలదీసారు. ఆణిముత్యం లాంటి పదాన్ని తీసేసిన కేసీఆర్ 'బందిపోట్ల రాష్ట్ర సమితి' పెట్టుకున్నారని షర్మిల ఎద్దేవా చేసారు. ప్రజాప్రస్థాన పాదయాత్రలో భాగంగా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరులో జరిగిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం జై తెలంగాణ అని నినదించడానికి కూడా వెనకాడుతున్నారని... ఇటీవల నాందేడ్ సభలో ఆయన ప్రసంగం వింటేనే ఇది అర్థమవుతుందని అన్నారు. తెలంగాణ పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఇప్పుడు ఆ పదాన్నే ఉపయోగించడానికి ఇష్టపడక పోవడం దారుణమని... 'జై తెలంగాణ అనే దమ్ముందా కేసీఆర్' అంటూ షర్మిల నిలదీసారు.