Asianet News TeluguAsianet News Telugu

పెద్దమనిషివేనా కేసీఆర్... ఆడబిడ్డకు నువ్విచ్చే బహుమతి ఇదా..: షర్మిల సీరియస్

హైదరాబాద్ : వరంగల్ జిల్లా నర్సంపేటలో తన పాదయాత్ర సందర్భంగా చోటుచేసుకున్న ఉద్రిక్తతలపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు.  

హైదరాబాద్ : వరంగల్ జిల్లా నర్సంపేటలో తన పాదయాత్ర సందర్భంగా చోటుచేసుకున్న ఉద్రిక్తతలపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు.  రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వ తప్పులు, ప్రజా సమస్యలను ఎత్తిచూపుతున్నామని... ఇలా మా నుండి ఎదురయ్యే సవాళ్లను స్వీకరించి ప్రజల ముందుకొచ్చే దమ్ము లేకే వెనకనుంచి దాడి చేస్తున్నారని అన్నారు. మాతో పాటు పాదయాత్రలో పాల్గొనాలని... రాష్ట్రంలో సమస్యలను చూపించలేకపోతే ముక్కు నేలకు రాసి క్షమాఫణలు చెప్పి వెళ్లిపోతానని కూడా సవాల్ చేసానని అన్నారు. తమను ప్రత్యక్షంగా ఎదుర్కొలేకే దొంగచాటున దాడులకు దిగుతున్నారని షర్మిల ఆందోళన వ్యక్తం చేసారు. 

తన పాదయాత్రను టీఆర్ఎస్ గూండాలు అడ్డుకుని దాడులు చేసి వాహనాలకు నిప్పంటించడమే కాదు కార్లను మాపైకి ఎక్కించే ప్రయత్నం చేసారని షర్మిల అన్నారు. అలాంటిది వారిని అదుపులోకి తీసుకోవాల్సిన పోలీసులు తమనే అరెస్ట్ చేయడమేంటని షర్మిల ప్రశ్నించారు. అరెస్ట్ సమయంలో పోలీసులు తనతో చాలా దురుసుగా ప్రవర్శించారని... ఈడ్చుకెళ్లి పోలీస్ వ్యాన్ లో పడేస్తే ముఖంపై గాయాలయ్యాయని షర్మిల అన్నారు. సీఎం కేసీఆర్ కు బుద్ది, ఇంగితం ఎలాగూ లేదు కనీసం ఈ వయసులో సిగ్గయినా వుంటే, పెద్దమనిషి అన్న ఇంగితం వుంటే ఇలాంటి పనులు చేయరని షర్మిల మండిపడ్డారు.