కాళేశ్వరం అవినీతిలో బండి సంజయ్, రేవంత్ కు వాటా...: వైఎస్ షర్మిల సంచలనం

న్యూడిల్లీ : తెలంగాణలో భారీ అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా మారారని వైఎస్సార్ టిపి అధినేత్రి వైఎస్ షర్మిల ఆరోపించారు.

First Published Oct 9, 2022, 12:28 PM IST | Last Updated Oct 9, 2022, 12:28 PM IST

న్యూడిల్లీ : తెలంగాణలో భారీ అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా మారారని వైఎస్సార్ టిపి అధినేత్రి వైఎస్ షర్మిల ఆరోపించారు. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారానే కేసీఆర్ కుటుంబం లక్షలకోట్లు సంపాదించిందని ఆరోపించారు. మేఘా కంపనీ నుండి ముడుపులు అందాయి కాబట్టే తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి, బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి, కేసీఆర్ అవినీతిగురించి నోరుమెదపడం లేదని అన్నారు. కేసీఆర్ కు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏటిఎెంలా మారిందని బిజెపి కేంద్ర పెద్దలు, కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, షెకావత్ వంటివారు ఆరోపిస్తారు... కానీ మీరే అధికారంలో ఉండి కూడా ఎందుకు ఎంక్వైరీ చేయించడం లేదు? అని షర్మిల నిలదీసారు. టీఆర్ఎస్ కు ‘బీ’ టీంగా బీజేపీ పనిచేస్తుందా? అంటూ షర్మిల అనుమానం వ్యక్తం చేసారు. కాళేశ్వరం అవినీతితో కేంద్రానికి సంబంధముందా...? ఎందుకు వారు కేసీఆర్ ను కాపాడుతున్నారు...? విచారణ ఎందుకు లేదు...? అంటూ షర్మిల ప్రశ్నలు సంధించారు. దేశంలోనే కాళేశ్వరం అతిపెద్ద స్కామ్ అని షర్మిల పేర్కొన్నారు. ఇక మునుగోడు ఉప ఎన్నిక ప్ర‌జ‌ల కోసం వ‌చ్చిన ఎన్నిక కాదు... స్వార్థ రాజకీయాల కోసం వచ్చిన ఎన్నిక అన్నారు.  వీధిలో కుక్క‌ల్లాగే బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కొట్లాడుకుంటున్నాయంటూ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేసారు.