ఫోన్ విసిరేశారని.. పెట్రోల్ బాటిల్ తో బిల్డింగ్ మీదికి..

జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైనా గ్రామంలో ఓ వ్యక్తి పెట్రోల్ బాటిల్ తో బిల్డింగ్ పైకి ఎక్కి హల్ చల్ చేశాడు.

First Published Jun 27, 2020, 3:49 PM IST | Last Updated Jun 27, 2020, 3:49 PM IST

జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైనా గ్రామంలో ఓ వ్యక్తి పెట్రోల్ బాటిల్ తో బిల్డింగ్ పైకి ఎక్కి హల్ చల్ చేశాడు. ఇసుక అక్రమ డంపుల వద్ద  ఇసుక సీజ్ చేయకుండా ఎం.ఆర్.ఓ, అర్.ఐ.లతో బ్యారం మాట్లాడుతున్నారని దాన్నితన సెల్ లో రికార్డ్ చేశానని కుడిక్యాల వెంకటేష్ అనే యువకుడు అన్నాడు. అది గమనించిన ఆర్ ఐ, పోలీసులతో కుమ్మక్కై తన ఫోన్ పగలగొట్టి, తనను చంపుతానని బెదిరించాడని వెంకటేష్ ఆరోపిస్తున్నాడు.  దీంతో మనస్తాపానికి గురై బిల్డింగ్ పైకి పెట్రోల్ బాటిల్ తో ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని వెంకటేష్ హల్చల్ చేశాడు. ఇసుక అక్రమ రవాణా ఆపకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. విషయం తెలిసిన ధర్మపురి పోలీసులు నచ్చచెప్పడంతో వెంకటేష్ క్రిందకు దిగివచ్చాడు.