మైనర్ బాలికపై ఈటల అనుచరుడి లైంగిక వేధింపులు... జమ్మికుంటలో కాంగ్రెస్ ఆందోళన

హుజురాబాద్ : మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన బిజెపి నాయకుడు కొమ్ము అశోక్ ను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో హుజురాబాద్ లో ఆందోళన చేపట్టారు. 

First Published Dec 8, 2022, 3:08 PM IST | Last Updated Dec 8, 2022, 3:08 PM IST

హుజురాబాద్ : మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన బిజెపి నాయకుడు కొమ్ము అశోక్ ను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో హుజురాబాద్ లో ఆందోళన చేపట్టారు. జమ్మికుంటకు చెందిన బాలిక కుటుంబసభ్యులు నాలుగురోజుల క్రితమే ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అనుచరుడు అశోక్ లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసినా పోలీసులు ఇప్పటివరకు యాక్షన్ తీసుకోలేదని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. వెంటనే అశోక్ ను బిజెపి నుండి బహిష్కరించాలని, పోలీసులు కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ యూత్ నిరసన చేపట్టారు. జమ్మికుంట గాంధీ చౌరస్తాలో అశోక్ దిష్టిబొమ్మను  దహనం చేసారు.