World Economic Forum 2022 : లండన్ నుండి స్విట్జర్లాండ్ కు కేటీఆర్... ఘన స్వాగతం

దావోస్:  తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) విదేశీ పర్యటనల్లో బిజీబిజీగా గడుపుతున్నారు

First Published May 23, 2022, 10:07 AM IST | Last Updated May 23, 2022, 10:07 AM IST

దావోస్:  తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) విదేశీ పర్యటనల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. గత నాలుగురోజులుగా లండన్ లో ప్రముఖ కంపనీలతో సమావేశమై తెలంగాణ పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించిన మంత్రి వరల్డ్ ఎకానమిక్ ఫోరంలో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్ కు చేరుకున్నారు. విమానంలో స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు టిఆర్ఎస్ పార్టీ ఎన్ఆర్ఐ స్విట్జర్లాండ్ విభాగంతో పాటు వివిధ రంగాలకు చెందిన ఎన్ఆర్ఐలు ఘనస్వాగతం పలికారు. జ్యూరిచ్ నుండి రోడ్డుమార్గంలో ఎకనామిక్ ఫోరం సదస్సు జరిగే దావోస్ కు రోడ్డుమార్గంలో చేరుకోనున్నారు.