డబుల్ బెడ్రూం ఇళ్లు ఎన్నడిస్తవ్..:మంత్రి గంగులను నిలదీసిన మహిళ
కరీంనగర్: కరీంనగర్ పట్టణంలో వివిధ అభివృద్ధి పనులను పర్యవేక్షించడానికి పర్యటన చేపట్టిన మంత్రి గంగుల కమలాకర్ కు చేదు అనుభవం ఎదురయ్యింది.
కరీంనగర్: కరీంనగర్ పట్టణంలో వివిధ అభివృద్ధి పనులను పర్యవేక్షించడానికి పర్యటన చేపట్టిన మంత్రి గంగుల కమలాకర్ కు చేదు అనుభవం ఎదురయ్యింది. ఆయన మీడియాతో మాట్లాడుతుండగా ఓ మహిళ తనకు ఇళ్లు కట్టుకోడానికి జాగా ఇవ్వాలని మంత్రిని కోరింది. స్థలం ఇవ్వడం కాదు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తానని మంత్రి సదరు మహిళకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే తాను ఓటేసి చాలారోజులు అవుతుందని... ఓటు వేసేటప్పుడు ఇస్తామని చెప్పిన ఇళ్లు ఇప్పటికి రాలేదంటూ నిలదీశారు. దీంతో ఇళ్ల నిర్మాణం జరుగుతోందని... పూర్తయ్యాక ఇస్తామని చెప్పి గంగుల అక్కడి నుండి వెళ్ళిపోయారు.