భర్తను కోల్పోయి పుట్టెడు ధు:ఖంలోనూ... పిల్లలతో కలిసి రోడ్డెక్కిన మహిళ
పెద్దపల్లి : భర్త మృతిచెంది పుట్టెడు ధు:ఖంలో వున్న మహిళ పిల్లలతో కలిసి రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పెద్దపల్లి : భర్త మృతిచెంది పుట్టెడు ధు:ఖంలో వున్న మహిళ పిల్లలతో కలిసి రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. భర్త బ్రతికుండగా ఎంతో కష్టపడి కూడబెట్టిన డబ్బులను యజమాని వద్ద వుండగా... అవి ఇవ్వకుండా ఇబ్బందిపెడుతున్నాడని బాధిత మహిళ ఆరోపించారు. దీంతో అతడి ఇంటిముందు చిన్న పిల్లలను తీసుకుని మహిళ ఆందోళనకు దిగింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో వెలుగుచూసింది.
ఎలిగేడు మండలం బుర్హాన్ మియా పేట గ్రామానికి చెందిన దుబాసి శ్రీనివాస్ హార్వస్టర్ డ్రైవర్ గా పనిచేసేవాడు. పది నెలల క్రితం గుండెపోటుతో అతడు మృతిచెందాడు. దీంతో అతడి హార్వెస్టర్ యజమాని నుండి భారీగా డబ్బులు రావాల్సి వుండగా రెండు లక్షల 50వేల రూపాయలు చెల్లించాడు. మిగతా 6 లక్షల 50వేలు ఆరు నెలల్లో చెల్లిస్తానని పదినెలలు అయినా చెల్లించడం లేదంటూ శ్రీనవాస్ భార్య సౌందర్య ఆందోళన వ్యక్తం చేసారు. దీంతో హార్వెస్టర్ యజమాని ఇంటి ముందు మృతుడి భార్యా, పిల్లలు ధర్నా చేపట్టారు. బాధిత మహిళకు అండగా నిలిచిన మహిళా సంఘాలు ఆందోళనలో పాల్గొన్నారు.