కల్నల్ సంతోష్ భార్యను రిసీవ్ చేసుకున్న సజ్జనార్... సూర్యాపేటకు పయనం..

లడఖ్‌లోని గాల్వాన్ లోయలో చైనా సైన్యంతో తలెత్తిన ఘర్షణలో అమరుడైన కల్నల్ సంతోష్ బాబు భార్య, పిల్లలు నేటి ఉదయం హైదరాబాద్ రాగా.. సీపీ సజ్జనార్ వారిని రిసీవ్ చేసుకున్నారు.

First Published Jun 17, 2020, 12:45 PM IST | Last Updated Jun 17, 2020, 12:45 PM IST

లడఖ్‌లోని గాల్వాన్ లోయలో చైనా సైన్యంతో తలెత్తిన ఘర్షణలో అమరుడైన కల్నల్ సంతోష్ బాబు భార్య, పిల్లలు నేటి ఉదయం హైదరాబాద్ రాగా.. సీపీ సజ్జనార్ వారిని రిసీవ్ చేసుకున్నారు. ప్రత్యేక వాహనంలో వారిని సూర్యాపేట పంపిస్తున్నారు. భారత్ చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో అమరుడైన కల్నల్ సంతోష్‌ పార్థీవ దేహాన్ని ఆర్మీ ప్రత్యేక విమానంలో బుధవారం సాయంత్రం 4 గంటలకు పార్థీవదేహం హైదరాబాద్ హకీంపేట్ విమానాశ్రయానికి  చేరుకుంటుంది. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సూర్యాపేటకు తరలిస్తారు. సూర్యాపేట పట్టణంలోని హిందూ శ్మశాన వాటికలో సైనిక లాంఛనాలతో సంతోష్ అంత్యక్రియలను నిర్వహిస్తారు.కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది బంధువుల సమక్షంలోనే సంతోష్ అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది.