పెద్దపల్లిలో ఘోరం... భర్తను గడ్డపారతో కొట్టిచంపిన భార్య
పెద్దపల్లి : మద్యానికి బానిసైన భర్తను ఓ మహిళ అతి కిరాతకంగా హతమార్చింది. తాగుబోతు భర్త వేధింపులు భరించలేకపోయిన ఆ ఇల్లాలు ఈ దారుణానికి ఒడిగట్టింది.
పెద్దపల్లి : మద్యానికి బానిసైన భర్తను ఓ మహిళ అతి కిరాతకంగా హతమార్చింది. తాగుబోతు భర్త వేధింపులు భరించలేకపోయిన ఆ ఇల్లాలు ఈ దారుణానికి ఒడిగట్టింది. ఇలా తండ్రి హత్య, తల్లి ఎక్కడికో పారిపోవడంతో ముగ్గురు చిన్నారులు అనాధలుగా మారారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... పెద్దపల్లి జిల్లా ఓదేల మండలం లంబాడి తండాకు చెందిన గుగులోత్ తేజ నాయక్(32) మద్యానికి బానిసయ్యాడు. తాగుబోతు భర్త నిత్యం మద్యంమత్తులో వుంటూ కుటుంబ పోషణను మరిచిపోవడంతో భార్య కవిత కూలీనాలి చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. అయితే తాగినమత్తులో ఇంటికివచ్చి భర్త నిత్యం వేధిస్తుండటంతో సహనం కోల్పోయిన భార్య దారుణ నిర్ణయం తీసుకుంది. మద్యంసేవించి ఇంటికివచ్చిన భర్త నిద్రలో వుండగా తలపై గడ్డపారతో కొట్టిచంపి పరారయ్యింది కవిత. భార్య దాడిలో తీవ్రంగా గాయపడ్డ తేజ నాయక్ రక్తపుమడుగులో పడి మృతిచెందాడు. తండ్రి చనిపోయి, తల్లి పరారవడంతో ముగ్గురు పిల్లలు మహేష్(9), మహాదేవి(8), గిరిధర్(6) అనాధలుగా మారారు.