వైరల్ వీడియో : ఐసీయూలో వధువు మెడలో తాళి కట్టిన వరుడు.. భలే పెళ్లి అంటున్న నెటిజన్స్..

మంచిర్యాల : వివాహానికి ఒక్కరోజు ముందు వధువు అస్వస్థతకు గురి కావడంతో ఆస్పత్రి ఐసీయూలోనే పెళ్లి జరిగిన ఘటన మంచిర్యాలలో చర్చనీయాంశంగా మారింది.

First Published Feb 24, 2023, 11:33 AM IST | Last Updated Feb 24, 2023, 11:32 AM IST

మంచిర్యాల : వివాహానికి ఒక్కరోజు ముందు వధువు అస్వస్థతకు గురి కావడంతో ఆస్పత్రి ఐసీయూలోనే పెళ్లి జరిగిన ఘటన మంచిర్యాలలో చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వివరాల్లోకి వెడితే... గత నెలలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన తిరుపతికి, చెన్నూరు మండలం లంబాడిపల్లికి చెందిన శైలజకు పెద్దలు పెళ్లి కుదిర్చారు. దీని ప్రకారం.. గురువారం వివాహం జరగాల్సింది. కానీ, ఒక రోజు ముందు బుధవారంనాడు శైలజ అస్వస్థత గురైంది. వధువు పరిస్థితి కొంచెం సీరియస్ ఉండటంతో అదేరోజు రాత్రి  ఆపరేషన్ కూడా చేశారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చిక్సిత పొందుతోంది. అయితే, పెళ్లి వాయిదా వేయడం ఎందుకని భావించిన ఇరు కుటుంబాల పెద్దలు ఒక అంగీకారానికి వచ్చి ఆసుపత్రిలోనే బెడ్ పై ఉన్న శైలజతో అనుకున్న ముహుర్తానికే అందరి సమక్షంలో తిరుపతితో తాళి కట్టించారు.